Anni Manchi Shakunamule - బడ్జెట్ 20 కోట్లు, రిలీజ్ కు ముందే రూ.21 కోట్లు

Anni Manchi Shakunamule - విడుదలకు ముందే బ్రేక్ ఈవెన్ అయింది ఈ సినిమా. నిర్మాతలు ఫుల్ హ్యాపీ.

Advertisement
Update: 2023-05-17 13:09 GMT

విడుదలకు ముందే డబ్బులొచ్చేస్తే ఆ నిర్మాత ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఇప్పుడు స్వప్న దత్, ప్రియాంక దత్ ఆనందం కూడా అలానే ఉంది. స్వప్న సినిమాస్ బ్యానర్ పై అన్నీ మంచి శకునములే అనే సినిమాను నిర్మించారు వీళ్లు. ఇప్పుడీ సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు లాభం తెచ్చిపెట్టింది.

అటుఇటుగా 20 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది అన్నీ మంచి శకునములే సినిమా. ఈ సినిమా నాన్-థియేట్రికల్ బిజినెస్ 21 కోట్ల రూపాయలు చేసింది. అంటే.. విడుదలకు ముందే కోటి రూపాయలు లాభం అన్నమాట. దీంతో ఈ సినిమాను తెలుగులో సోలోగా రిలీజ్ చేస్తున్నారు ఈ నిర్మాతలు. సినిమా హిట్టయితే మరిన్ని లాభాలొస్తాయి, ఫ్లాప్ అయితే అక్కడికది సరిపోతుంది. నష్టం మాత్రం రాదు.

సంతోష్ శోభన్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు నందినీరెడ్డి దర్శకురాలు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. రేపు థియేటర్లలోకి వస్తోంది అన్నీ మంచి శకునములే సినిమా.

సో.. ఈ సినిమాతో నిర్మాతలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎటొచ్చి దర్శకురాలు, హీరోకు మాత్రం ఇది పరీక్ష కాలం. ఈ సినిమా సక్సెస్ అయితేనే తన కెరీర్ నిలబడుతుందని నందినీరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇక వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సంతోష్ శోభన్ కూడా ఈ సినిమాపై గంపెడాశలు పెట్టుకున్నాడు.

Tags:    
Advertisement

Similar News