#KH237 | దర్శకులుగా మారుతున్న ఫైట్ మాస్టర్లు

Kamal Hassan - కమల్ హాసన్ కొత్త సినిమాతో ఫైట్ మాస్టర్లు అన్బు-అరివ్ దర్శకులుగా పరిచయమౌతున్నారు.

Advertisement
Update: 2024-01-12 17:34 GMT

ఉలగనాయగన్ కమల్ హాసన్, ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్ లో మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ థ్రిల్లర్ 'థగ్ లైఫ్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది.

మరోవైపు కమల్ హాసన్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు సంబధించిన ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్‌లు అన్బరివ్ (అన్బుమణి, అరివుమణి) దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ విషయాన్ని కమల్ హాసన్ తెలియజేస్తూ.. 'ఇద్దరు ప్రతిభావంతులు, వారి కొత్త అవతార్‌లో దర్శకులుగా చేరడం గర్వంగా ఉంది. మాస్టర్స్ అన్బరివ్... రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌కి తిరిగి స్వాగతం' అని ట్వీట్ చేశారు.

కెరీర్ లో కమల్ హాసన్ కు ఇది 237వ చిత్రం. ఈ సినిమాతో అన్బు-అరివ్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ తమ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News