Allu Arjun Wax Statue | బన్నీ పక్కన బన్నీ

Allu Arjun - అల్లు అర్జున్ మరో ఘనత సాధించాడు. దుబాయ్ లో అతడి మైనపు ప్రతిమను ఆవిష్కరించారు.

Advertisement
Update: 2024-03-30 16:54 GMT

భారతీయ ప్రముఖుల మైనపు విగ్రహాలు కొలువుదీరడం చాన్నాళ్లుగా నడుస్తోంది. లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఆల్రెడీ నిండిపోయింది. ఆ తర్వాత బ్యాంకాక్ లో మరో బ్రాంచ్ తెరిచారు. అక్కడ కూడా విగ్రహాలకు లెక్కలేదు.


తాజాగా దుబాయ్ లో కూడా మేడమ్ టుస్సాడ్స్ మైనపు విగ్రహాల మ్యూజియం తెరిచారు. ఇందులో కొంతమంది ప్రముఖుల విగ్రహాల్ని పెట్టారు. అలా దుబాయ్ మ్యూజియంలో కొలువుదీరిన తొలి సౌత్ హీరోగా చరిత్ర సృష్టించాడు అల్లు అర్జున్. అవును.. బన్నీ మైనపు విగ్రహాన్ని దుబాయ్ టుస్సాడ్స్ లో పెట్టారు. ఈ విగ్రహాన్ని అల్లు అర్జున్ స్వయంగా తన చేతులమీదుగా ఆవిష్కరించాడు.


దీనికోసం కుటుంబంతో కలిసి అతడు కొన్ని రోజుల కిందట దుబాయ్ వెళ్లాడు. అల వైకుంఠపురములో ఎరుపు రంగు కోటు, లోపల తెల్ల షర్ట్ వేసుకున్న బన్నీ స్టయిల్ చాలా మందిని ఆకర్షించింది. దానికి పుష్ప సినిమాలోని తగ్గేదేలే మేనరిజమ్ ను యాడ్ చేశారు. ఈ రెండు అంశాల్ని కలబోసి దుబాయ్ లో బన్నీని రీ-క్రియేట్ చేశారు.


ఎంత నిశితంగా పరిశీలించినా ఇది విగ్రహం అనే విషయాన్ని మనం నమ్మలేం. అంత సహజంగా బొమ్మలు తయారుచేయడం టుస్సాడ్స్ ప్రత్యేకత. దీనికోసం వాళ్లు కేశాలు, కనుగుడ్లు, చేతివేళ్లు లాంటి చిన్నచిన్న అంశాల్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. మరో 9 రోజుల్లో తన పుట్టినరోజును జరుపుకోబోతున్నాడు బన్నీ. ఈ పుట్టినరోజుకు బన్నీ స్పెషల్ ఇదే.

Tags:    
Advertisement

Similar News