Allu Arjun, Trivikram Srinivas | నాలుగోసారి కలిసిన జోడీ

Allu Arjun, Trivikram Srinivas | బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో నాలుగో సినిమా ప్రకటన వచ్చేసింది.

Advertisement
Update: 2023-07-03 11:11 GMT

Allu Arjun, Trivikram Srinivas | నాలుగోసారి కలిసిన జోడీ

Allu Arjun, Trivikram Srinivas | అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో 'జులాయి', 'సన్ ఆఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' సినిమాలు రూపొందాయి. ఈ 3 సినిమాలు కూడా ఒకదానికిమించి మరొకటి అన్నట్టుగా ఘన విజయం సాధించాయి. ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందింది.

గురుపూర్ణిమ శుభ సందర్భంగా, వీరి కలయికలో నాలుగో సినిమా ప్రకటన వచ్చింది. త్రివిక్రమ్, బన్నీ కలయికలో వచ్చిన ప్రతి సినిమా హిట్టయింది. జులాయిలో రవీంద్ర నారాయణ్ గా.. సన్నాప్ సత్యమూర్తిలో విరాజ్ ఆనంద్ గా.. అల వైకుంఠపురములో సినిమాలో బంటుగా మెప్పించాడు బన్నీ.

ఇప్పుడు వీళ్లిద్దరి కలయికలో ఓ సోషియో ఫాంటసీ సినిమా రాబోతోంది. కథా చర్చలు కూడా ముగిశాయి. పుష్ప-2 పూర్తయిన వెంటనే సెట్స్ పైకి వచ్చే సినిమా ఇదే.

అగ్ర చిత్ర నిర్మాణ సంస్థలు హారిక & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ ఉంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది.

Tags:    
Advertisement

Similar News