Mangalavaaram | మంగళవారం కోసం అల్లు అర్జున్

Mangalavaaram - పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మంగళవారం. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు బన్నీ స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నాడు.

Advertisement
Update: 2023-11-10 17:07 GMT

'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా 'మంగళవారం'. పాయల్ రాజ్‌పుత్, 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించారు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి అజయ్ భూపతి నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మతో కలిసి సినిమాను ప్రొడ్యూస్ చేశాడు.

నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'మంగళవారం' సినిమా విడుదల కానుంది. ఇప్పుడీ సినిమా కోసం అల్లు అర్జన్ రంగంలోకి దిగబోతన్నాడు. శనివారం జరగనున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రానున్నాడు. అల్లు ఆర్మీ, అభిమానుల సమక్షంలో ఈ వేడుక జరగ నుంది.

'మంగళవారం' ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది. సినిమాలో 3 పాటలను కూడా విడుదల చేశారు. వాటికి మంచి స్పందన లభిస్తోంది. 'ఆర్ఎక్స్ 100' తరహాలో మరోసారి డిఫరెంట్ కంటెంట్ అండ్ కమర్షియల్ బేస్డ్ సినిమాతో అజయ్ భూపతి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారనే నమ్మకం ప్రేక్షకులలో కలిగించింది.

పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. ట్రయిలర్ కు అతడిచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Tags:    
Advertisement

Similar News