Ugram Trailer - అల్లరి నరేష్ నటవిశ్వరూపం

Ugram movie Trailer - అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా ఉగ్రం. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేశారు.

Advertisement
Update: 2023-04-22 02:49 GMT

నాంది సినిమాతో విజయవంతమైన చిత్రాన్ని అందించారు అల్లరి నరేష్, విజయ్ కనకమేడల. వీళ్లిద్దరూ కలిసి ఇప్పుడు మరో ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌ ఉగ్రంపై అంచనాలని పెంచింది.

తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ ఉగ్రం కథాంశాన్ని రివీల్ చేసింది. నగరంలో మిస్సింగ్ కేసుల వెనుక ఉన్న కొంతమంది పవర్ ఫుల్ వ్యక్తులపై నిజాయితీ గల పోలీసు భారీ రిస్క్ తీసుకొని చేసిన పోరాటం ఉగ్రం. అతని కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తారు. అయితే అతను కేసును ఛేదించి, నేరస్థులను పట్టుకోవడానికే మొగ్గు చూపుతాడు.

ట్రైలర్‌లో అల్లరి నరేష్ కొత్తగా, మునుపెన్నడూ చూడని ఉగ్రరూపంలో కనిపించాడు. ముఖ్యంగా, ట్రైలర్ రెండవ సగం అతన్ని విభిన్నంగా ప్రజంట్ చేసింది. ట్రైలర్ గ్రిప్పింగ్ గా ఉంది.

సిద్ సినిమాటోగ్రఫీ, శ్రీచరణ్ పాకాల బీజీఏం ట్రయిలర్ కు మంచి ఫీల్ తీసుకొచ్చాయి. సినిమాలో నరేష్ భార్యగా మిర్నా కనిపించింది. ఉగ్రం చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మించారు. వేసవి కానుకగా మే 5న ఉగ్రం థియేటర్లలో విడుదల కానుంది.


Full View


Tags:    
Advertisement

Similar News