Ugram Movie: అల్లరోడు కూడా సమ్మర్ కే

Ugram Movie: అల్లరి నరేష్ తాజా చిత్రం ఉగ్రం. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ లో రిలీజ్ చేయబోతున్నారు.

Advertisement
Update: 2023-01-04 04:12 GMT

అల్లరి నరేష్‌ హీరోగా విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఉగ్రం'. నాంది వంటి సూపర్ హిట్‌ తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రమిది. ఇందులో అల్లరి నరేష్ పోలీస్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

ఒక స్పెషల్ గ్లింప్స్ ద్వారా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ పై అప్డేట్ ఇచ్చారు. ఆ వీడియోలో నరేష్ బైక్ నడుపుతూ ఇంటెన్స్ గా కనిపించారు. బైక్‌ను ఆపి తుపాకీ తీసుకుని గట్టిగా అరుస్తూ ఎవరినో కాల్చాడం ఆసక్తికరంగా ఉంది. వీడియో చివర్లో ఏప్రిల్ 14 విడుదల అంటూ ప్రకటించారు.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా హీరోయిన్ గా నటిస్తోంది. కొంతమంది ప్రముఖ నటీనటులు సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. నాందికి పని చేసిన టెక్నికల్ టీం అంతా దాదాపు 'ఉగ్రం' కోసం పని చేస్తోంది.

అబ్బూరి రవి ఈ సినిమాకు డైలాగ్స్ రాస్తున్నాడు . శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. టీజర్ లో శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


Full View


Tags:    
Advertisement

Similar News