Akhil Akkineni | అఖిల్ సినిమాకు దారేది

Akhil Akkineni - తన కొత్త సినిమాను ఇప్పటివరకు ప్రకటించలేదు అక్కినేని అఖిల్. కారణం ఏంటి?

Advertisement
Update: 2023-11-09 01:01 GMT

హీరో అఖిల్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఎంచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. అతని మునుపటి చిత్రం ఏజెంట్ విడుదలై బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్‌గా నిలిచి 6 నెలలకు పైగా అయ్యింది. అప్పటి నుంచి అఖిల్ మరో ప్రాజెక్ట్ వైపు వెళ్లలేదు. సాధారణంగా ప్లాన్ ప్రకారం యువి క్రియేషన్స్ బ్యానర్‌లో అనిల్ అనే కొత్త దర్శకుడితో భారీ బడ్జెట్ సినిమా చేయాల్సి ఉంది.

అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు, ఇంకా అధికారికంగా అప్ డేట్ రావాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇంకా జరుగుతోంది. అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కిందామీద పడుతున్నట్టు తెలుస్తోంది. అతడు ఎటూ తేల్చుకోలేకపోతున్నాడట.

సెట్స్‌పైకి వెళ్లే ముందు పూర్తి స్థాయి స్క్రిప్ట్‌ను కోరుకున్నాడు అఖిల్. ప్రస్తుతం ఆ దిశగానే పనులు సాగుతున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు మరికొన్ని స్క్రిప్టులు కూడా వింటున్నాడట.

ఇప్పటివరకు అతను అధికారికంగా ఏ సినిమానూ ధృవీకరించలేదు. ఏజెంట్ రిజల్ట్ అతడిని చాలా తీవ్రంగా ప్రభావితం చేసింది. ఏజెంట్ కోసం అఖిల్ ప్రాణంపెట్టి పనిచేశాడు, అది కాస్తా డిజాస్టర్ అయ్యేసరికి తట్టుకోలేకపోయాడు. తన కెరీర్ లో గేమ్ ఛేంజర్ అవుతుందనుకున్న సినిమా, అట్టర్ ఫ్లాప్ అయ్యేసరికి అఖిల్ కు పెద్ద షాక్ తగిలినట్టయింది.

దర్శకుడు వంశీ పైడిపల్లి, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో అఖిల్ మరో రెండు సినిమాల గురించి చర్చిస్తున్నట్లు సమాచారం. శ్రీకాంత్ ఓదెల, దసరా సినిమాతో తన టాలెంట్ చాటుకున్నాడు. అఖిల్, శ్రీకాంత్ కాంబినేషన్ క్రేజీగా ఉంటుంది. మరి అఖిల్ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News