Maidaan | ఆకట్టుకుంటున్న మైదాన్ ట్రయిలర్

Maidaan Movie - అజయ్ దేవగన్ నటించిన బయోపిక్ మైదాన్. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ చేశారు.

Advertisement
Update: 2024-03-08 09:08 GMT

బయటి ప్రపంచానికి అంతగా తెలియని మన రియల్ హీరో సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్రను చూపించేందుకు ‘మైదాన్’ అనే సినిమా రాబోతోంది. అజయ్ దేవగన్ పోషించిన ఈ పాత్రతో కోచ్‌గా భారతదేశం కోసం ఆయన చేసిన కృషి, చరిత్రలో ఎలాంటి రికార్డులను సృష్టించాడు? అనే కథాంశంతో మైదాన్ రాబోతోంది.

ప్రపంచంలో అత్యధికంగా ఆడే క్రీడ అయిన ఫుట్‌బాల్‌లో మన దేశం గతంలో ఎలా రాణించింది, ఎలాంటి విజయాన్ని సాధించింది లాంటి అంశాల్ని ఇందులో చూపించబోతోన్నారు.

యదార్థ ఘటనల ఆధారంగా ఈ ‘మైదాన్’ సినిమాను 'బదాయి హో' ఫేమ్ అమిత్ రవీందర్నాథ్ శర్మ తెరకెక్కించారు. మైదాన్ చిత్రంలో.. ప్రియమణి, గజరాజ్ రావు, ప్రసిద్ధ బెంగాలీ నటుడు రుద్రనీల్ ఘోష్ కూడా నటించారు.

సయ్యద్ అబ్దుల్ రహీమ్ అద్భుతమైన ప్రయాణం, ఫుట్ బాల్ ఆటను ఐమ్యాక్స్ లో కూడా చూడొచ్చు. జీ స్టూడియోస్, బోనీ కపూర్, అరుణవ జాయ్ సేన్‌గుప్తా, ఆకాష్ చావ్లా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది రంజాన్‌కు థియేటర్లలో విడుదల చేయనున్నారు. తెలుగులో కూడా సినిమా రిలీజ్ అవుతోంది.

Full View

Tags:    
Advertisement

Similar News