Ajaneesh Loknath - కాంతార సంగీత దర్శకుడి తెలుగు సినిమా

Ajaneesh Loknath - తెలుగులో మరో సినిమాకు కమిట్ అయ్యాడు కాంతార మ్యూజిక్ డైరక్టర్.

Advertisement
Update: 2023-01-20 16:05 GMT

'ఆర్ఎక్స్100' తో అందరి దృష్టి ఆకర్షించిన దర్శకుడు అజయ్ భూపతి. తన సొంత బ్యానర్ 'ఎ క్రియేటివ్ వర్క్స్', 'ముద్ర మీడియా వర్క్స్' బ్యానర్లపై న్యూ జానర్ కథతో తన మూడవ చిత్రం చేయనున్నాడు.

'విక్రాంత్ రోనా' 'కాంతార' వంటి చిత్రాలకి సెన్సేషనల్ ఆల్బమ్ అందించిన 'అజనీష్ లోకనాథ్' ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఒకవైపు డివైన్ ఆల్బమ్స్ ఇస్తూనే మాస్ పాటలతో ఉర్రూతలూగించడం అజనీష్ ప్రత్యేకత.

ఎలాంటి కథలో అయినా తన నేపథ్య సంగీతం, పాటలతో మరో స్థాయికి తీసుకెళ్లే అజనీష్ లోకనాథ్ అజయ్ భూపతి మూడవ చిత్రానికి సంగీతం అందించడం, ఈ ప్రాజెక్ట్ లెవెల్ పెరిగింది.

సరికొత్త కథ కథనాలతో తెరకెక్కనున్న ఈ చిత్ర టైటిల్ ని ఇతర నటీనటుల వివరాలని త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపిన దర్శకుడు అజయ్ భూపతి, అజనీష్ లాంటి ప్రతిభ గల సంగీత దర్శకుడితో తన సొంత బ్యానర్ లో చేయనున్న మొదటి చిత్రంలో పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నాడు.

Tags:    
Advertisement

Similar News