Naresh's Malli Pelli Movie: మళ్లీ పెళ్లి రిలీజ్ తర్వాత ఆటంబాంబ్ పేలుతుంది

Naresh's Malli Pelli Movie: మళ్లీ పెళ్లి సినిమా ఆటంబాంబ్ లా పేలుతుందని అంటున్నాడు సీనియర్ నటుడు నరేష్.

Advertisement
Update: 2023-05-22 11:02 GMT

Naresh's Malli Pelli Movie: మళ్లీ పెళ్లి రిలీజ్ తర్వాత ఆటంబాంబ్ పేలుతుంది

సీనియర్ నటుడు నరేష్ హీరోగా నటించిన తాజా చిత్రం మళ్లీ పెళ్లి. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఆటం బాంబ్ లా పేలుతుందని చెబుతున్నాడు నరేష్. ఇదొక పెద్ద సంచలనం అవుతుందనేది ఆయన నమ్మకం.

"ఒకప్పుడు ఎం.ఎస్‌.రాజుగారి సినిమాలో నటించాలకునేవాడిని. అలా వదిన వరస అయిన జయసుధ తో వాన సినిమాలో భార్యభర్తలుగా చేయించారు. డర్టీహరీ సినిమా చూశాక అందులో యంగ్‌ మాన్‌ ఆయనలో కనిపించాడు. ఆయనతో కొంతకాలం జర్నీ చేశాక ఓ కథ వినిపించారు. బాగా నచ్చి వెంటనే చేద్దాం అన్నా. అమ్మ కోరిక మేరకు విజయకృష్ణ గ్రీన్‌ స్టూడియో స్థాపించాం. ఇక ఈ సినిమా ఎం.ఎస్‌.రాజుగారు కాకపోతే మొదలయ్యేది కాదు. ట్రైలర్‌ లో కొద్దిగానే చూశారు. విడుదలయ్యాక ఆటంబాంబ్‌ పేలుతుంది."

తెలుగు, కన్నడ భాషల్లో.. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ లలో విడుదల కాబోతుంది. ఈ సినిమాతో తనకు రీఎఁట్రీ అనిపిస్తోందని ప్రకటించిన నరేష్.. జీవితంలో ఇప్పటివరకు తనకు నచ్చింది మాత్రమే చేశానని చెప్పుకొచ్చారు.

"నాకు నచ్చింది నేను చేస్తాను. మా అమ్మ గుడికి వెళ్ళి అమ్మ కళ్ళలో చూస్తాను. నాకు ఆలోచన వస్తుంది అదే చేస్తాను. రాజకీయాల్లోకి వెళ్ళాను. సేవా కార్యక్రమాలు చేశాను. ఒక సిద్ధాంతంతో బిజెపి లో పనిచేశాను. అయినా తృప్తి లేదు. మరలా కళామతల్లి వైపు వచ్చాను. నన్ను మెచ్చిన దర్శక నిర్మాతలు మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. నేను రోజూ వ్యాయామం చేస్తాను. మైండ్‌ ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం."

తన నిజజీవిత భాగస్వామి పవిత్రతో కలిసి మళ్లీ పెళ్లి సినిమా చేశాడు నరేష్. ఇందులో తన నిజజీవిత ఘటనలు ఎన్ని ఉన్నాయో తెలియాలంటే, సినిమా చూడాలని ఊరిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News