My Dear Donga | కమెడియన్ సినిమా నేరుగా ఓటీటీలోకి

My Dear Donga - అభినవ్ గోమటం సినిమా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ఆ సినిమా పేరు మై డియర్ దొంగ.

Advertisement
Update: 2024-04-06 09:40 GMT

అభినవ్ గోమటం నటించిన ఓ సినిమా ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి రాబోతోంది. ఏప్రిల్ 19న ఆహాలో విడుద‌ల కానుంది మై డియ‌ర్ దొంగ‌. అభిన‌వ్ గోమ‌టం, షాలిని కొండేపూడి, దివ్య శ్రీపాద కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది.

ఆహా, కేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. షాలిని కొండేపూడి ర‌చించారు. బి.ఎస్‌.స‌ర్వ‌జ్ఞ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సెల్ప్ డిస్క‌వ‌రీ, ఎంప‌వ‌ర్‌మెంట్ ప్ర‌ధానంగా సాగే సినిమా ఇది. కొత్త కంటెంట్ కు థియేటర్లలో కూడా ఆదరణ దక్కుతున్న రోజులివి. అందుకే ఈ సినిమాను ముందుగా థియేటర్లలో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఇప్పుడు నేరుగా ఆహాలో స్ట్రీమింగ్ కు పెడుతున్నారు.

ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌ చాలామందికి నచ్చింది. షాలిని కొండేపూడి పాత్ర అభిన‌వ్‌ని దొంగ అని ప్రేమ‌గా పిల‌వ‌డం... ప్రేక్ష‌కులకు నచ్చింది. ఇటీవ‌ల ఈ సినిమాకు సంబంధించి ప్రైవేట్ స్క్రీనింగ్‌ కూడా ఏర్పాటుచేశారు. వివిధ వర్గాలకు చెందిన ప్రేక్షకులు సినిమా చూసి మెచ్చుకున్నారట.

నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నాడు అభినవ్ గోమటం. రీసెంట్ గా వచ్చిన కిస్మత్ సినిమాలో కూడా అతడి నటన అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు మై డియర్ దొంగ సినిమాతో మరోసారి తన టాలెంట్ చూపించబోతున్నాడు ఈ నటుడు. 

Tags:    
Advertisement

Similar News