ఇకపై జాగ్రత్తగా కథలు ఎంచుకుంటా!

ఇకపై కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానంటున్నాడు ఆది సాయికుమార్. పైగా ఓటీటీలోకి కూడా ఎంటరయ్యాడు.

Advertisement
Update: 2022-10-14 02:49 GMT

ఆది సాయికుమార్.. ఈ హీరో కెరీర్ లో హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువ. అయినప్పటికీ మినిమం గ్యాప్స్ లో ఇతడు సినిమాలు రిలీజ్ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే, అతడి సినిమాలకు అమెజాన్ ప్రైమ్ వీడియోస్, హిందీ డబ్బింగ్ రైట్స్ శ్రీరామరక్ష. ఆ రెండు మార్కెట్లు ఉన్నంతవరకు ఆది సాయికుమార్ కెరీర్ సాగిపోతూనే ఉంటుంది. థియేట్రికల్ రన్ తో పని లేదు.

అయితే ఇకపై మాత్రం మరింత జాగ్రత్తగా ఉంటానంటున్నాడు ఆది. మరీ ముఖ్యంగా కథల ఎంపికలో ఈసారి మరింత అప్రమత్తంగా ఉంటానని చెబుతున్నాడు. తండ్రి అనుభవాన్ని కూడా ఉపయోగించుకుంటానంటున్నాడు.

"కొన్ని కథలు నాన్న వింటారు. కొన్ని నేను విని తొందర పాటు నిర్ణయాలు తీసుకుంటాను (నవ్వుతూ). ముందు చక్కగా కథ వినమని చెబుతారు నాన్న. ఆయన జడ్జ్ మెంట్ బాగుంటుంది. ఇకపై చాలా జాగ్రత్తగా కథలు ఎంచుకుంటాను. ఆచితూచి సినిమాలు చేస్తాను."

ఆది సాయికుమార్ హీరోగా నటించిన క్రేజీ ఫెలో సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాతో పాటు తొలిసారిగా ఓ వెబ్ సిరీస్ ట్రై చేస్తున్నాడు ఆది సాయికుమార్. వీటితో పాటు ఓ క్రైమ్ థ్రిల్లర్ కూడా చేస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News