Aa Okkati Adakku | నాని చేతుల మీదుగా ట్రయిలర్!

Aa Okkati Adakku Trailer - అల్లరి నరేష్ చేసిన కామెడీ ఎంటర్ టైనర్ 'ఆ ఒక్కటి అడక్కు'. ఈ సినిమా ట్రయిలర్ ను నాని రిలీజ్ చేశాడు.

Advertisement
Update: 2024-04-22 17:22 GMT

కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

ఈ సినిమా టీజర్‌కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు థియేట్రికల్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశాడు.

హీరోకు ఇంకా పెళ్లి కాలేదనే విషయాన్ని తెలియజేసేలా హిలేరియస్ ఎపిసోడ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. హీరోకి క్యాస్ట్ ఫీలింగ్ లేకపోయినా 49 సార్లు అమ్మాయిలచే రిజెక్ట్ అవుతాడు. మ్యారేజ్ బ్యూరోలు కూడా తనకి తగిన జోడి వెతకడంలో విఫలమౌతాయి. అతను ఫరియా అబ్దుల్లాతో ప్రేమలో పడతాడు. అయితే, ఆ బంధాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లడానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

ఈ తరం యువతకు పెళ్లి పెద్ద సమస్య కావడంతో మల్లి అంకెం ఈ అంశాన్ని ఎంచుకుని వినోదాత్మకంగా చెప్పాడు. కామెడీ టైమింగ్ తో అల్లరి నరేష్ ఎప్పటిలాగే అదరగొట్టాడు. అతని కామిక్ టైమింగ్ ఆకట్టుకుంది. ఫరియా అబ్దుల్లాకు కీలక పాత్ర లభించింది. వెన్నెల కిషోర్, వైవా హర్షలు మరింత వినోదాన్ని అందించారు.

గోపీ సుందర్ తన స్కోర్‌తో ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కు సరైన మూడ్‌ని సెట్ చేశాడు. ఈ చిత్రానికి అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు. టాలీవుడ్ బిగ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రం ఏపీ, తెలంగాణ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

Full View

Tags:    
Advertisement

Similar News