Dil Raju: కొత్త బ్యానర్ ప్రకటించిన దిల్ రాజు

Dil Raju: నిర్మాత దిల్ రాజుకు SVC బ్యానర్ ఉంది. ఇప్పుడు దీనికి అనుబంధంగా మరో బ్యానర్ స్థాపించాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్.

Advertisement
Update: 2022-12-17 12:33 GMT

టాలీవుడ్ లో బడా బ్యానర్లు, వాటికి అనుబంధంగా బ్రాంచ్ బ్యానర్లు పెట్టడం ఆనవాయితీగా నడుస్తోంది. వైజయంత్రీ మూవీస్ కు స్వప్న సినిమాస్ ఉంది. గీతాఆర్ట్స్ కు జీఏ2 ఉంది. యూవీ క్రియేషన్స్ కు కూడా యూవీ కాన్సెప్ట్స్ అనే బ్యానర్ ఉంది. ఇలా చాలా పెద్ద బ్యానర్లు సబ్ బ్రాంచ్ లు తెరిచాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి దిల్ రాజు కూడా చేరాడు.

దిల్ రాజు పేరు చెప్పగానే ఎస్వీసీ బ్యానర్ కళ్లముందు కదులుతుంది. ఇప్పుడీ బ్యానర్ కు అనుబంధంగా "దిల్ రాజు ప్రొడక్షన్స్" అనే కొత్త బ్యానర్ స్థాపించాడు రాజు. ఎస్వీసీ బ్యానర్ పై నిర్మాతగా దిల్ రాజు పేరు పడుతుంది. "దిల్ రాజు ప్రొడక్షన్స్" కు మాత్రం నిర్మాతగా దిల్ రాజు కూతురు పేరు పడుతుంది.

ఈ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా ఏటీఎం అనే వెబ్ సిరీస్ తీస్తున్నారు. త్వరలోనే జీ5లో అది ప్రసారం అవుతుంది. ఇప్పుడు రెండో ప్రాజెక్టుగా స్ట్రయిట్ సినిమా తీశారు. దీని పేరు బలగం. ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. కమెడియన్ వేణు, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ప్రియదర్శి, కావ్యా కల్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించాడు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తారు.




Tags:    
Advertisement

Similar News