Kushi Movie | విజయ్ దేవరకొండ మూవీ నుంచి మరో మెలొడీ

Kushi Movie - ఖుషి మూవీ నుంచి ముచ్చటగా మూడో సాంగ్ రిలీజైంది. ఈ పాటకు కూడా హిట్టయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

Advertisement
Update: 2023-07-28 17:30 GMT

విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఈ మధ్యే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. మరోవైపు మ్యూజికల్ ప్రమోషన్స్ కొనసాగుతున్నాయి.

తాజాగా ఖుషి నుంచి మూడో సింగిల్ రిలీజ్ చేశారు. ఖుషి అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్ ఇప్పుడు శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు శివ నిర్వాణ సాహిత్యం అందించాడు. హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించడంతో పాటు, స్వయంగా ఆలపించాడు. ఈ బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. ఇక ఇందులో విజువల్స్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఉన్నాయి.

ఇప్పటికే ఖుషి ఫస్ట్ సింగిల్ 'నా రోజా నువ్వే' 100 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసింది. ఇనస్టాగ్రాం రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఇలా ఎక్కడపడితే అక్కడ ట్రెండ్ అవుతూనే ఉంది. రెండో పాట ఆరాధ్య సైతం శ్రోతలను కట్టి పడేసింది. ఇప్పుడు ఈ మూడో పాట ఖుషి సైతం చార్ట్ బస్టర్ అయ్యేలా కనిపిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతోన్నారు. లైగర్ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న సినిమా ఇదే.

Full View

Tags:    
Advertisement

Similar News