30 Years Prudhvi: కూతుర్ని డైరక్ట్ చేసిన 30 ఇయర్స్ పృధ్వీ

30 Years Prudhvi directed his daughter - 30 ఇయర్స్ పృధ్వి కూతురు పేరు శ్రీలు. ఈమె కోసం డైరక్టర్ గా మారారు పృధ్వి.

Advertisement
Update: 2023-01-28 14:50 GMT

30 ఇయర్స్ పృధ్వీ అంటే అందరికీ తెలుసు. ఆయన కామెడీ, మేనరిజమ్స్ అందరికీ తెలిసిందే. ఇలాంటి ఆర్టిస్టు దర్శకుడిగా మారాడు. స్వయంగా తన కూతుర్ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ సినిమా తీశాడు.

ఇప్పటివరకు ప్రేక్షకులను తనదైన కామెడీతో, మేనరిజంతో ఆకట్టుకున్న సీనియర్ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వీ రాజ్, దర్శకుడిగా మారారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమా "కొత్త రంగుల ప్రపంచం".

పృద్విరాజ్ ,క్రాంతి కృష్ణ, శ్రీలు, విజయ రంగరాజు, అశోక్ కుమార్, గీతాసింగ్, జబర్దస్త్ నవీన్ నటీనటులుగా శ్రీ పిఆర్ క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు.

ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి ఎంటరైంది. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ను తాజాగా రిలీజ్ చేసింది చిత్రబృందం.

ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఉంది. ఈ సినిమాతో శ్రీలు హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈమె స్వయానా 30 ఇయర్స్ పృధ్వీ కూతురు. అలా కూతుర్ని, తన దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు పృధ్వీ.

Tags:    
Advertisement

Similar News