Nani's Dasara Movie: దసరా నుంచి మరో సాంగ్ రెడీ

Nani's Dasara Movie Song: దసరా సినిమా నుంచి రెండో సాంగ్ రెడీ అయింది. వాలంటైన్స్ డే కానుకగా విడుదలకానుంది.

Advertisement
Update: 2023-02-10 15:15 GMT

Nani's Dasara Movie: దసరా నుంచి మరో సాంగ్ రెడీ

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'దసరా'. ప్రచారంతో ఈ సినిమా మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. నాని మాస్ అవతార్, ఫస్ట్‌ సాంగ్‌ ధూమ్‌ధామ్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటివలే విడుదలైన దసరా టీజర్ నేషనల్ సెన్సేషన్ గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి అన్ని భాషల్లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

తాజాగా మేకర్స్ దసరా సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందు ఫిబ్రవరి 13 ‘ఓరి వారి’ అనే హార్ట్‌ బ్రేక్ సాంగ్ ని విడుదల చేయనున్నారు.

శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కీర్తి సురేష్ ఈ సినిమాలో నానికి జోడిగా కనిపించనుంది.

దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. దసరా చిత్రాన్ని మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.

Tags:    
Advertisement

Similar News