Amazon Prime Video New Releases in November 2022: అమెజాన్ లో వచ్చే నెల పండగే పండగ

Amazon Prime Video New Releases in November 2022: అమెజాన్ చందాదారులకు శుభవార్త. వచ్చే నెల 2 పెద్ద సినిమాలు అమెజాన్ లో అందుబాటులోకి రాబోతున్నాయి...

Advertisement
Update: 2022-10-27 04:24 GMT

కొన్నాళ్ల నుంచి స్తబ్దుగా మారింది అమెజాన్ ప్రైమ్ వీడియో. మంచి సినిమాలేవీ స్ట్రీమింగ్ కు రావడం లేదు. రీసెంట్ గా అమ్ము సినిమా వచ్చినప్పటికీ అది పెద్దగా సౌండ్ చేయలేకపోయింది. అలా స్తబ్దుగా మారిన అమెజాన్, నవంబర్ లో 2 పెద్ద సినిమాలతో సందడి చేయబోతోంది.

మణిరత్నం డైరక్ట్ చేసిన పొన్నియన్ సెల్వన్-1 సినిమాను వచ్చే నెలలో స్ట్రీమింగ్ కు పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన వస్తుంది. ఈ సినిమాతో పాటు దేశవ్యాప్తంగా సూపర్ హిట్టయిన కాంతార సినిమాను కూడా నవంబర్ లోనే స్ట్రీమింగ్ కు తెస్తోంది అమెజాన్. ఈ రెండు సినిమాలతో అమెజాన్ మరోసారి హాట్ టాపిక్ గా మారబోతోంది.

ఒకప్పుడు అమెజాన్ లో ప్రతి వారం సినిమాలొచ్చేవి. చిన్న-పెద్ద తేడా లేకుండా టాలీవుడ్ కు చెందిన చాలా మూవీస్ అమెజాన్ లో ప్రత్యక్షమయ్యేవి. కానీ ఇప్పుడు అమెజాన్ తన పద్ధతి మార్చుకుంది. డిజిటల్ రైట్స్ తీసుకునే క్రమంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. మరీ ముఖ్యంగా ఔట్ రేట్ కు రైట్స్ తీసుకునే పద్ధతి నుంచి పూర్తిగా తప్పుకుంది.

ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, దాన్ని పే-పెర-వ్యూ (చూసే దాన్ని బట్టి డబ్బు) విధానంలో మాత్రమే స్ట్రీమింగ్ చేస్తోంది. ఆ సినిమాను ఎన్ని గంటల పాటు, ఎంతమంది వీక్షకులు చూస్తే అంత డబ్బు వస్తుందన్నమాట. ఈ విధానంగా కూడా కేవలం కొన్ని సినిమాలకు మాత్రమే అమెజాన్ పర్మిషన్ ఇస్తోంది.

దీంతో కొన్నాళ్లుగా ఈ యాప్ లో సందడి తగ్గిపోయింది. అడపాదడపా మాత్రమే తెలుగు కంటెంట్ కనిపిస్తోంది. ఈ లోటును పీఎస్-1, కాంతార సినిమాలు భర్తీ చేయబోతున్నాయి.

Tags:    
Advertisement

Similar News