ఈ ఏడాది టాప్‌లో బిర్యానీ! నిమిషానికి ఎన్ని ఆర్డర్లంటే..

ఈ ఏడాది ఎక్కువమంది ఇష్టపడిన ఫుడ్‌లో బిర్యానీ టాప్ ప్లేస్‌లో ఉందని జొమాటో తెలిపింది. 2022 సంవత్సరానికి గానూ జొమాటో తన ఇయర్ ఎండింగ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసింది.

Advertisement
Update: 2022-12-29 12:43 GMT

ఈ ఏడాది టాప్‌లో బిర్యానీ! నిమిషానికి ఎన్ని ఆర్డర్లంటే..

ఈ ఏడాది ఎక్కువమంది ఇష్టపడిన ఫుడ్‌లో బిర్యానీ టాప్ ప్లేస్‌లో ఉందని జొమాటో తెలిపింది. 2022 సంవత్సరానికి గానూ జొమాటో తన ఇయర్ ఎండింగ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసింది.

ఈ సంవత్సరం మనదేశంలోని ఫుడ్ లవర్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడ్డ ఫుడ్ ఐటమ్ బిర్యానీ. ఈ ఏడాది జొమాటో దేశవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 186 బిర్యానీ ఆర్డర్‌లను డెలివరీ చేసింది. అలాగే ప్రతి నిమిషానికి 139 పిజ్జా ఆర్డర్‌లు డెలివరీ చేసింది.

జొమాటో రిపోర్ట్‌ ప్రకారం ఢిల్లీకి చెందిన అంకుర్ అనే వ్యక్తి ఏకంగా 3,330 ఫుడ్ ఆర్డర్స్ చేసి రికార్డు సృష్టించాడు. అయితే ఈ రికార్డు అతనికి కొత్తేమీ కాదు. 2021 లో ఇదే వ్యక్తి రోజుకు 9 ఫుడ్ ఆర్డర్స్ చేశాడు. ముంబైకి చెందిన ఓ కస్టమర్ ప్రోమో కోడ్స్ ద్వారా ఏడాదిలో రూ.2.43 లక్షలు ఆదా చేశాడట. అలాగే పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్ నుంచి వచ్చిన ఆర్డర్స్‌లో 99.7 శాతం ఆర్డర్లు ప్రోమో కోడ్ ద్వారానే వచ్చాయట.

ఇకపోతే స్విగ్గీలో కూడా ఈ ఏడాది బిర్యానీనే టాప్‌లో ఉంది. స్విగ్గీ ప్రతీ నిమిషానికి 137 బిర్యానీలను డెలివరీ చేసినట్టు ప్రకటించింది. అలాగే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఓ వ్యక్తి ఒక్క ఏడాదిలో రూ.16 లక్షల విలువైన కిరాణా సరుకుల్ని ఆర్డర్ చేశాడట.

మరో వ్యక్తి దీపావళి సందర్భంగా కేవలం ఒక్క ఆర్డర్‌లో రూ.75,378 విలువైన సరుకుల్ని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా తెప్పించుకున్నాడు. ఈ ఏడాది స్విగ్గీలో 50 లక్షల కిలోల ఆర్గానిక్ పండ్లు, కూరగాయలను కస్టమర్లు ఆర్డర్ చేసారు. ఫ్రూట్స్, వెజిటేబుల్స్‌లో పుచ్చకాయలు, అరటిపండ్లు, టమోటాలు టాప్‌లో ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News