నేడు (25-12-2022) స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి

ఆదివారం ఉదయం వరకు బులియన్ మార్కెట్‌లో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధర రూ.150 నుంచి రూ.160 వరకూ పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,850కి చేరింది.

Advertisement
Update: 2022-12-25 03:54 GMT

దేశంలో బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో అంచనా వేయడం చాలా కష్టం. క్షణాల వ్యవధిలోనే రేట్లలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక మొన్నటి వరకు పరుగులు పెట్టి.. పసిడి ప్రియులకు షాకిచ్చింది. అయితే నిన్న మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలోనే బంగారం ధర పతనమైంది. ఈ క్రమంలో ఇక బంగారం ధర క్రమంగా దిగొస్తుందని చాలా మంది భావించారు. కానీ, వాళ్ల అంచనాలను తలకిందులు చేస్తూ పసిడి రేటు మళ్లీ పెరిగింది. ఇక వెండి ధర కూడా భారీగా పెరిగింది.

ఆదివారం ఉదయం వరకు బులియన్ మార్కెట్‌లో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధర రూ.150 నుంచి రూ.160 వరకూ పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,850కి చేరింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.54,380కు ఎగబాకింది. ఇక దేశీయంగా కిలో వెండి ధర నిన్న 70,100 ఉన్న విషయం తెలిసిందే. అయితే నేటి ఉదయానికి వెండి ధర రూ.1000 పెరగడంతో.. ప్రస్తుతం దాని రేటు రూ.71,100కు చేరుకుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేస్తే..

22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ.49,850.. రూ.54,380

విజయవాడలో రూ.49,850.. రూ.54,380

విశాఖపట్నంలో రూ.49,850 .. రూ.54,380

చెన్నైలో రూ.50,790.. రూ.55,400

కోల్‌కతాలో రూ.49,850.. రూ.54,380

బెంగళూరులో రూ.49,900.. రూ.54,410

కేరళలో రూ.49,850.. రూ.54,490

ఢిల్లీలో రూ.50,000.. రూ.54,380

ముంబైలో రూ.49,850.. రూ.54,380

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,000

విజయవాడలో రూ.74,000

విశాఖపట్నంలో రూ.74,000

చెన్నైలో కిలో వెండి ధర రూ.74,000

బెంగళూరులో రూ.74,000

కేరళలో రూ.74,000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,000

ముంబైలో కిలో వెండి ధర రూ.71,000

Tags:    
Advertisement

Similar News