Mahindra XUV700 AX5 S | దేశీయ మార్కెట్‌లోకి మ‌హీంద్రా ఎక్స్‌యూవీ700 ఏఎక్స్5 ఎస్.. రూ.16.89 ల‌క్ష‌ల నుంచి షురూ..!

Mahindra XUV700 AX5 S | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (Mahindra & Mahindra) త‌న పాపుల‌ర్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ700 (XUV700) కారు న్యూ ఏఎక్స్‌5 సెలెక్ట్ (New AX5 Select (AX5 S) వేరియంట్‌ను ఆవిష్క‌రించింది.

Advertisement
Update: 2024-05-23 09:05 GMT

Mahindra XUV700 AX5 S | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (Mahindra & Mahindra) త‌న పాపుల‌ర్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ700 (XUV700) కారు న్యూ ఏఎక్స్‌5 సెలెక్ట్ (New AX5 Select (AX5 S) వేరియంట్‌ను ఆవిష్క‌రించింది. పెట్రోల్ వేరియంట్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్‌ రూ.16.89 ల‌క్ష‌లు (ఎక్స్ షోరూమ్‌), డీజిల్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ రూ.17.49 ల‌క్ష‌లు (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతుంది.

స్కై రూఫ్‌, డ్యుయ‌ల్‌-26.04 సీఎం హెచ్‌డీ సూప‌ర్ స్క్రీన్‌, పుష్ బ‌ట‌న్ స్టార్ట్ లేదా స్టాప్‌, 7- సీట‌ర్ కాన్ఫిగ‌రేష‌న్ వంటి ఫీచ‌ర్లతో మ‌హీంద్రా ఎక్స్‌యూవీ700 ఏఎక్స్‌5 సెలెక్ట్ మోడ‌ల్‌లో ఉంటాయి. అయితే హై ఎండ్ మోడ‌ల్ కార్ల‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంటాయ‌ని మ‌హీంద్రా వెల్ల‌డించింది.

మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా త‌న పాపుల‌ర్ ఎక్స్‌యూవీ 700 మోడ‌ల్ కార్ల‌లో ప‌లు వేరియంట్ల‌ను నిరంతరం మార్కెట్లో ఆవిష్క‌రిస్తోంది. 7-సీట‌ర్ ఎంఎక్స్ వేరియంట్, ఎక్స్7ఎల్ ట్రిమ్ బ్లేజ్ ఎడిష‌న్ కార్లు ఆవిష్క‌రించింది. ఈ కార్లు బ్లేజ్ రెడ్ క‌ల‌ర్‌, డ్యుయ‌ల్ టోన్ బ్లాక్ ఎక్స్‌టీరియ‌ర్, ఆల్ బ్లాక్ ఇంటీరియ‌ర్ విత్ రెడ్ అసెంట్స్ ఫీచ‌ర్లు ఉన్నాయి. మ‌హీంద్రా త‌న పాపుల‌ర్ ఎస్‌యూవీ కార్ల కోసం క‌స్ట‌మ‌ర్ల వెయింటింగ్ పీరియ‌డ్ త‌గ్గించ‌డానికి ఉత్పాద‌క సామ‌ర్థ్యం పెంచేసింది. వివిధ కార్ల‌లో వేరియంట్ల వారీగా మ‌హీంద్రా కార్ల డెలివ‌రీ కోసం నాలుగు నుంచి ఎనిమిది వారాల స‌మ‌యం ప‌డుతుంది.

వేరియంట్ల వారీగా మ‌హీంద్రా 700ఎక్స్‌యూవీ ఏఎక్స్5 ధ‌ర వ‌ర‌లు ఇలా

వేరియంట్ - సీటింగ్ - పెట్రోల్ ఎంటీ - డీజిల్ ఎంటీ (ఎక్స్ షోరూమ్‌)

ఎంఎక్స్ - 5 సీటర్ - రూ.13.99 ల‌క్ష‌లు - రూ.14.59 ల‌క్ష‌లు

ఎంఎక్స్‌- 7 సీట‌ర్ - రూ.14.49 ల‌క్ష‌లు - రూ. 14.99 ల‌క్ష‌లు

ఏఎక్స్‌3* - 5-సీట‌ర్ - రూ.16.39 ల‌క్ష‌లు - రూ.16.99 ల‌క్ష‌లు

ఏఎక్స్5 ఎస్* - 7 సీట‌ర్ - రూ.16.89 ల‌క్ష‌లు - రూ.17.49 ల‌క్ష‌లు

ఏఎక్స్5 * 5 - 5 సీట‌ర్ - రూ. 17.69 ల‌క్ష‌లు - రూ.18.29 ల‌క్ష‌లు

ఏఎక్స్5 * 5 - 7 సీట‌ర్ - రూ.18.19 ల‌క్ష‌లు - రూ.18.79 ల‌క్ష‌లు

మ‌హీంద్రా ఎక్స్‌యూవీ 700 ఏఎక్స్5 సెలెక్ట్ వేరియంట్ కారులో ఫీచ‌ర్లు ఇవే..:

* స్కై రూఫ్

* డ్యుయ‌ల్ హెచ్‌డీ 26.03 సీఎం ఇన్‌ఫోటైన్మెంట్‌, 26.03 సీఎం డిజిట‌ల్ క్ల‌స్ట‌ర్ స్క్రీన్

* ఇన్ బిల్ట్ నేవిగేష‌న్ విత్ నేటివ్ మ్యాప్స్‌

* ఎడ్రెనోక్స్ విత్ 75+ క‌నెక్టెడ్ ఫీచ‌ర్లు

* ప‌ర్స‌న‌లైజ్డ్ గ్రీటింగ్ అండ్ సేఫ్టీ అల‌ర్ట్స్‌

* అమెజాన్ అలెక్సా బిల్ట్ ఇన్‌

* పుష్ బ‌ట‌న్ స్టార్ట్‌

* వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో

* వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే కంపాటిబిలిటీ

* అడ్రెనోక్స్ క‌నెక్ట్ విత్ వ‌న్ ఇయ‌ర్ ఫ్రీ స‌బ్‌స్క్రిప్ష‌న్‌

* 6-స్పీక‌ర్స్ విత్ సౌండ్ స్టేజింగ్‌

* థ‌ర్డ్ రో ఏసీ

* సెకండ్ రో సీట్ విత్ ఆర్మ్‌రెస్ట్ అండ్ క‌ప్ హోల్డ‌ర్‌

* సెకండ్ రో 60:40 వ‌న్ ట‌చ్ టంబుల్‌

* ఫ్లెక్సిబుల్ బూట్ స్పేస్ (థ‌ర్డ్ రో 50:50 స్ప్లిట్ విత్ రీక్లైన్ )

* ఎల్ఈడీ డీఆర్ఎల్

* సెకండ్ రో మ్యాప్ ల్యాంప్స్

* టిల్ట్ అడ్జ‌స్ట‌బుల్ స్టీరింగ్

* స్పీడ్ సెన్సిటివ్ డోర్ లాక్స్‌

* సెంట‌ర్ ఆర్మ్‌రెస్ట్ విత్ స్టోరేజీ

* అన్ని డోర్ల‌లోనూ బాటిల్ హోల్డ‌ర్

* నాలుగు విండో సీట్ల‌కు అడ్జ‌స్ట‌బుల్ హెడ్ రెస్ట్‌

* ఫాలోమీ హోం హెడ్ ల్యాంప్స్‌

* రూఫ్ ల్యాంప్ ఫ‌ర్ ఫ‌స్ట్ అండ్ సెకండ్ రో

* మైక్రో హైబ్రీడ్ టెక్నాల‌జీ

* ఐసోఫిక్స్‌

* ఎలక్ట్రిక‌ల్లీ అడ్జ‌స్ట‌బుల్ ఓఆర్వీఎంస్‌

* యారో హెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్‌

* ఫుల్ సైజ్డ్ వీల్ కవ‌ర్స్‌

Tags:    
Advertisement

Similar News