హైదరాబాద్‌లో కార్ రేస్ ఈవెంట్.. బుకింగ్ ఎలాగంటే.

Car race event in Hyderabad: హైదరాబాద్‌లో ఫార్ములా వన్ మాదిరి కార్ రేస్ జరగబోతోంది. ఈ ఈవెంట్ పేరు ఫార్ములా ఈ-ఫిక్స్‌ కార్‌ రేస్‌. దీనికోసం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ మార్గ్‌ను రెడీ చేస్తున్నారు.

Advertisement
Update: 2022-11-11 10:17 GMT

How to book tickets Car race event in Hyderabad

హైదరాబాద్‌లో ఫార్ములా వన్ మాదిరి కార్ రేస్ జరగబోతోంది. ఈ ఈవెంట్ పేరు ఫార్ములా ఈ-ఫిక్స్‌ కార్‌ రేస్‌. దీనికోసం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ మార్గ్‌ను రెడీ చేస్తున్నారు. ఈ ఈవెంట్ గురించిన పూర్తి వివరాలివే..

దేశంలోనే తొలిసారి జరగబోతున్న ఫార్ములా ఈ-ఫిక్స్‌ కార్‌ రేసు కోసం హైదరాబాద్ సిటీ ముస్తాబవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనున్న ఈ రేస్‌ కోసం ఎన్టీఆర్‌ గార్డెన్‌ చుట్టూ 2.7కిలోమీటర్ల ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 600మీటర్ల మేర ఎన్టీఆర్‌ గార్డెన్‌లో నుంచి కొత్తగా రోడ్డు వేస్తున్నారు. రేసులో కారు వేగం గరిష్టంగా 320కిలోమీటర్ల మేర ఉంటుంది. దానికనుగుణంగా రోడ్డును డిజైన్‌ చేస్తున్నారు. ట్రాక్‌ నిర్మాణం పూర్తవగానే ఈనెల 19, 20 తేదీల్లో మొదటి సారి, డిసెంబర్‌ 10, 11 తేదీల్లో రెండోసారి ట్రయల్స్‌ను నిర్వహిస్తామని అధికారులు చెప్తున్నారు.

రేస్ సందర్భంలో ఎన్టీఆర్‌ మార్గ్‌లో నాలుగు రోజుల పాటు రాకపోకలు నిలిపివేయనున్నారు. ఈ రేస్ చూసేందుకు 30వేల మందిని అనుమతిస్తారు. ఆడియెన్స్ కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేయనున్నారు. రేస్ చూసేందుకు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 11న అసలైన రేస్‌తో పాటు ఈనెల 19, 20 తేదీల్లో నిర్వహించే ట్రయల్స్‌ను వీక్షించేందుకు కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్లను బుక్‌ మై షోలో అందుబాటులో ఉంచారు. రెగ్యులర్‌ పాస్‌ రూ.749, వీకెండ్‌ పాస్‌ రూ.1249 నుంచి 11,999 వరకు ధరలు నిర్ణయించారు.

Tags:    
Advertisement

Similar News