నేడు (25-11-2022) పెరిగిన బంగారం ధర

గడిచిన నాలుగు రోజుల్లో తొలి రోజు స్థిరంగా ఉన్న బంగారం ధర ఆ తరువాత నుంచి తగ్గుముఖం పడుతూ వచ్చింది. మూడు రోజుల్లో రూ.400 మేర తగ్గింది.

Advertisement
Update: 2022-11-25 03:26 GMT

గత నాలుగు రోజులుగా బంగారం ధర అంతో ఇంతో తగ్గి ఊరటనిచ్చింది. కానీ నేడు నిన్నటి వరకూ ఎంతైతే తగ్గిందో దాదాపు అంత మొత్తం ఒకేసారి పెరిగి షాక్ ఇచ్చింది. గడిచిన నాలుగు రోజుల్లో తొలి రోజు స్థిరంగా ఉన్న బంగారం ధర ఆ తరువాత నుంచి తగ్గుముఖం పడుతూ వచ్చింది. మూడు రోజుల్లో రూ.400 మేర తగ్గింది. కానీ నేడు ఒక్కసారే బంగారం ధర తులంపై రూ.330 వరకూ పెరిగింది. ప్రస్తుతం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.48,550కు లభిస్తోంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,970కు చేరుకుంది. ఇక వెండి సైతం పెరిగింది కానీ అది అత్యల్పమే. దీనిని ఒక పెరుగుదలగా కూడా పరిగణించలేనంతగా పెరిగింది. అంటే కిలో వెండిపై రూ.120 మేర పెరిగి నేడు రూ. 62,200లకు చేరుకుంది. ఇవాళ ఉదయం నమోదైన ధ‌రల ప్రకారం.. ఇవాళ దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ.48,550.. రూ.52,970

విజయవాడలో రూ.48,550.. రూ.52,970

విశాఖపట్నంలో రూ.48,550.. రూ.52,970

ఢిల్లీలో రూ.48,700.. రూ.53,120

ముంబైలో రూ.48,550.. రూ.52,970

చెన్నైలో రూ.49,310.. రూ.53,780

కోల్‌కతాలో రూ.48,550.. రూ.52,970

బెంగళూరులో రూ.48,600.. రూ.53,020

కేరళలో రూ.48,550.. రూ.52,970

వెండి ధరలు

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,200

విజయవాడలో రూ.68,200

విశాఖపట్నంలో రూ.68,200

చెన్నైలో రూ.68,200

బెంగళూరులో రూ.68,200

కేరళలో రూ.68,200

ఢిల్లీలో రూ.62,200

ముంబైలో రూ.62,200

కోల్‌కతాలో రూ.62,200

Tags:    
Advertisement

Similar News