స్టూ ... డెంట్

ఫిబ్రవరి 2016 లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు అఫ్జల్ గురు ఉరి సందర్భంగా నిరసన తెలిపినప్పుడు వారి పై సెడిషన్ పెట్టిన సందర్భం

Advertisement
Update: 2023-02-19 07:30 GMT

ఎదురు తిరిగితే సెడిషన్

మిన్నకుంటే పెర్డిషన్

దాడులకీ ఆగని ఎడిషన్

ఇదీ నేటి పొలిటికల్ మిషన్ ...

విద్యా కేంద్రాలు విహ్వలలవుతున్నా

అధికార కేంద్రాలు ప్రజ్వలలవుతున్నా

నిర్జించే విద్యార్థులు

గర్జించే వజ్రాయుధులై

పశ్నిస్తే దేశద్రోహం ...

పెల్లుబికిన ధర్మాగ్రహం ...

అన్నిటికీ స్పందించే ఢిల్లీ

ఎన్నటికీ తోడుండే తల్లి

మూడు కళ్ళు లేని

పోరాట యోధులు ఎలుగెత్తితే

ఆరాట నాథులు అగరొతొత్తులూదితే

ప్రజాస్వామ్యం కొద్ది సేపు ఒణికింది

గణతంత్రం ఘన తంత్రం వినిపించింది ...

చదువుల నెలవులు

ఇలా ఉండనివ్వండని

నిర్దయులను వేడుకోడం మానేశాయ్

దుర్దినాలతో ఆడుకోడం మొదలెట్టాయ్

- సాయి శేఖర్

Tags:    
Advertisement

Similar News