సొబగు లొలుకు శోభకృతు

Advertisement
Update: 2023-03-24 04:55 GMT

శిశిరం

" చేదు" జ్ఞాపకాల మోడైతే

వసంతం

వలపు వన్నెల "తీయదనం".

వేకువ జామున వీచే

"వగరు" కలసిన

వేప పూల పరిమళం.

మామిడి పూత

మెరుపు ఎరుపులో

" పులుపు" పసిడిదనం.

చిటపటలాడే చీమ పచ్చిమిరప" (కటువు)"

చిలిపిదనం .

నేను రుచులందించే రాణినని

గర్వించే లావణ్యవతి" లవణం."

అన్ని రుచులు కలిసిన

అందమైన అనుభూతి ఈ ఉగాది .

జగమంతా నందన వనమై

సుమ బాలయై "శోభ కృతు "

సొబగు లొలుకుతూ విచ్చేసింది.

నూత్న సంవత్సర కన్యక కు

స్వాగతం పలుకుతూ....

- మంచాల శ్రీలక్ష్మీ (మైత్రి)

(రాజపూడి)

Tags:    
Advertisement

Similar News