తామరాకు పై నీటి బొట్టువు

Advertisement
Update: 2022-12-07 08:04 GMT

యాభై దాటిన నవ వృద్ధ యువకులారా

ఐదు పదులు దాటాటనికి

ఎక్కువ సమయమే పట్టింది

కాని ఆరు పదులు దాటటానికి

చాలా తక్కువ సమయం పడుతుంది.

పెద్ధలను, వృద్ధ తల్లిదండ్రులను

గౌరవించే తరం

మనదే చివరిది కావచ్చు.

ఇవన్నీ మనకి జరగకపోతే ఆనందం

ఒకవేళ జరిగితే వలదు ఆశ్చర్యం

బాల్యం చాల భారమైనది

ఆ భారం చాల వరకు

తల్లిదండ్రులు మోసేస్తారు.

యవ్వనమూ చాల భారమైనది

ఆ భారం కొంతవరకు మిత్రులు,

సింహభాగం భాగస్వామి మోసేస్తారు.

వృద్ధాప్యం చాల భారమైనది

ఆ భారం ఎవరూ పంచుకోరు

నీవే మోయాలి

పదవి విరమణ కోరే సమయానికి

మనం సైన్యంగా భావించిన మన

కాళ్ళు, కళ్ళు, కీళ్ళు, ఒళ్ళు

అన్ని కూడా అలసటను ప్రకటిస్తాయి.

మీ భాగస్వామి కూడా మునుపటి

ఊషారును కోల్పోయి విరామం కోరవచ్చు.

మరియు తెలియని దొంగలు

బిపి, షుగరుల రూపంలో

దేహంలో చొరబడతాయి.

క్షణం కూడా సెలవు తీసుకోని గుండె

సమాచారంలేని భూకంపంలా

ఏ క్షణంలోనైనా బంద్ (Stroke) ప్రకటించవచ్చు.

పదవివున్న కాలంలో లాగా

ఉదయాన్నే కాఫీ, టీలు

సమయానికి అందకపోవచ్చు

అడిగితే ఏం ఎక్కడెకెళ్ళాలి

ఆగలేవా కొంత సేపు

అనే ఈటెల్లాంటి మాటలు రావచ్చు.

కావున సహనం చాలా అవసరం

సత్కారములను, చీత్కారములను

ఒక చమత్కారముగానె స్వీకరించాలి

సన్మానమును, అవమానమును

సమానంగానె భావించాలి.

ఒకరు పలకరించారని

ఉప్పొంగిపోకు

ఇంకొకరు విస్మరించారని

కృంగిపోకు

అంటే ముసలి వాళ్ళంతా

మూసుకొని కూర్చోవాలా

ముసుగువేసుకొని పడుకోవాలా

కాదు...

మన బలాలు నెరిగి మసలు కోవాలి.

అవధులను లేదా పరిtdhuలను తెలుసుకోవాలి.

మనసు - అసంతృప్తి = స్వర్గం

మనసు X కోరికలు = నరకం

కావున..

దేనిపైన వలదు ఆరాటం

వృధా ఇకపై నీ చెలeగాటం

దేని కొరకు అసలీ పోరాటం

వలదు ఏ సంకోచం

వలదు ఏ సందేహం

సృష్టించకు ఏ సంక్షోభం

ఉపనిషత్తులలో చెప్పినట్లు

తామరాకు పైన నీటి బిందు

వులా (Detached గా ) వుంటూ

మన గమ్యం చేరాలి

- కృష్ణ అక్కులు

Tags:    
Advertisement

Similar News