వైజాగ్ లో హోటల్స్ హౌస్ ఫుల్.. జూన్-9కోసం వైసీపీ నేతలు సిద్ధం

వైసీపీ హడావిడి చూసి టీడీపీలో కలవరం మొదలైంది. జూన్-9న వైసీపీ నేతలు ప్రమాణ స్వీకారం ఉంటుందని ధీమాగా చెబుతుండే సరికి.. ఆ కాన్ఫిడెన్స్ కి కారణం ఏంటో టీడీపీ నేతలకు అర్థం కావడంలేదు.

Advertisement
Update: 2024-05-24 02:47 GMT

ఎన్నికల్లో గెలిచేది తామేనని, ముఖ్యమంత్రిగా రెండోసారి జగన్ ప్రమాణ స్వీకారం ఖాయమని ఇప్పటికే వైసీపీ నేతలు ఓ అంచనాకు వచ్చారు. ఏకంగా ప్రమాణ స్వీకార ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. జూన్-9న వైజాగ్ లో జగన్ ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని మంత్రి బొత్స సహా కీలక నేతలు ప్రకటించారు. కేవలం ప్రకటనతో సరిపెట్టడం కాదు, దానికి తగ్గట్టే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. వైజాగ్ లో జూన్-9 నాటికి ముందస్తుగా హోటల్ రూమ్ లు కూడా బుక్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల హోటల్స్ లో రూమ్ లు బ్లాక్ చేసి పెట్టినట్టు చెబుతున్నారు. వీఐపీలు, వీవీఐపీల కోసం ఏర్పాట్లు చేస్తున్నారట స్థానిక నేతలు. రిజల్ట్ వచ్చాక ప్రమాణ స్వీకారోత్సవ వేదిక ఫిక్స్ అవుతుందని అంటున్నారు.

టీడీపీలో కలవరం..

వైసీపీ హడావిడి చూసి టీడీపీలో కలవరం మొదలైంది. జూన్-9న వైసీపీ నేతలు ప్రమాణ స్వీకారం ఉంటుందని ధీమాగా చెబుతుండే సరికి.. ఆ కాన్ఫిడెన్స్ కి కారణం ఏంటో టీడీపీ నేతలకు అర్థం కావడంలేదు. మరోవైపు టీడీపీ కూడా పోటీగా అదే డేట్ ఫిక్స్ చేసింది. చంద్రబాబు సీఎంగా జూన్-9 ప్రమాణ స్వీకారం చేస్తారని గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే ఆయన వ్యాఖ్యల్ని టీడీపీ నేతలెవరూ సమర్థించకపోవడం, కనీసం మద్దతు తెలపకపోవడం విశేషం.

ఎవరి ధీమా వారిది..

ఏపీలో గెలుపుపై ఇటు వైసీపీ ధీమాగా ఉంది, అటు కూటమి కూడా అంతే నమ్మకంగా గెలిచేది తామేనంటోంది. సర్వేల సారాంశాన్ని ఎవరికి వారు తమకు అనుకూలంగా చెప్పుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో కన్ఫ్యూజన్ లేదనే చెప్పాలి. ఎవరు గెలిచినా మెజార్టీ భారీగా ఉండకపోవచ్చనే వాదన కూడా బలంగా వినపడుతోంది. 

Tags:    
Advertisement

Similar News