ఇంతకాలానికి ముసుగు తీసేశారా..?

తన తండ్రి హత్యలో కీలకమైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ వెంటనే అరెస్టు చేయాలనే డిమాండ్ ను మళ్ళీ వినిపించారు.

Advertisement
Update: 2024-03-02 05:52 GMT

మొత్తానికి ఎన్నికలకు ముందు వైఎస్ సునీత ముసుగు తీసేశారు. చాలాకాలంగా జగన్మోహన్ రెడ్డిపై పరోక్షంగా సునీత ఆరోపణలు, విమర్శలు చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో ప్రమేయమున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డిని జగన్ రక్షిస్తున్నారంటూ గోల చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు హత్యారాజకీయాలు చేసే జగన్‌కు వైసీపీకి ఓట్లేయద్దని ఢిల్లీలో మీడియా సమావేశంపెట్టి జనాలకు పిలుపిచ్చారు. తాజా పిలుపుతో జగన్ అంటే ఎంత వ్యతిరేకత ఉందో సునీత బయటపెట్టుకున్నట్లయ్యింది.

ఇంతకాలం సునీతను వెనకుండి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, రఘురామకృష్ణంరాజు నడిపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజా డెవలప్మెంట్లతో ఇది ప్రచారం కాదని, ముమ్మాటికి నిజమే అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. జగన్ పైన ఆరోపణలు చేసిన సునీత తనకు అండగా నిలిచిన చంద్రబాబు, పవన్, రఘురాజుకు ధన్యవాదాలు చెప్పుకోవటం ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళు ఏ విధంగా సునీతకు అండగా నిలిచారు..? ఏ విధంగా అంటే హైకోర్టు, సుప్రీం కోర్టులో అత్యంత ఖరీదైన లాయర్లను చంద్రబాబు, రఘురాజే అరేంజ్ చేసినట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. దాన్ని సునీత మాటలు నిజం చేస్తున్నట్లున్నాయి.

తన తండ్రి హత్యలో కీలకమైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ వెంటనే అరెస్టు చేయాలనే డిమాండ్ ను మళ్ళీ వినిపించారు. ఆధారాలు లేకపోయినా సరే, తాను ఆరోపణలు చేస్తున్నాను కాబట్టి అరెస్టుచేయాల్సిందే అన్నట్లుగా ఆమె మాట్లాడారు. వైఎస్ కుటుంబ సభ్యుల్లో ఇప్పటివరకు సొంతచెల్లెలు వైఎస్ షర్మిల మాత్రమే జగన్ను ఓడించాలని జనాలకు చెబుతున్నారు. ఇప్పుడు ఆమె సోద‌రి సునీత కూడా తోడయ్యారు. ఎన్నికలకు ముందు వీళ్ళిద్దరూ వ్యూహాత్మకంగా జగన్ వ్యతిరేక ప్రచారానికి దిగినట్లు అర్థ‌మైపోతోంది.

వివేకా హత్యకేసు పరిష్కారంలో జనాలందరూ తనకు అండగా నిలబడాలని సునీత విజ్ఞప్తి చేయటమే విచిత్రంగా ఉంది. వైఎస్ కుటుంబంలో 700 మందుంటే షర్మిల తప్ప ఇంకెవరు అండగా నిలవలేదని చెప్పారు. మరి కుటుంబసభ్యులే అండగా నిలబడకపోతే బయటవాళ్ళకు ఏమవసరం ఉంటుంది..? జగన్ కు, వైసీపీకి ఓట్లేయద్దంటే టీడీపీ కూటమికి ఓట్లేయమనే చెప్పినట్లే. జగన్ను ఓడగొట్టడం ద్వారా జనాలు తనకు అండగా నిలబడాలని సునీత అడిగినట్లుంది. మరి సునీత విజ్ఞప్తిని జనాలు పట్టించుకుంటారా..?

Tags:    
Advertisement

Similar News