వాస్తవాలు మరుగుపరిచి సజ్జలపై బురద

తాను రెయిన్ ట్రీ పార్క్‌ అపార్టుమెంట్స్‌లో ఉంటున్నానని, తన నివాసం మంగళగిరి నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని, దాంతో తాను మంగళగిరిలో తన ఓటును నమోదు చేసుకున్నానని సజ్జల చెప్పారు.

Advertisement
Update: 2024-02-14 11:46 GMT

వాస్తవాలను మరుగుపరిచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డిపై ఎల్లో మీడియా బురద చల్లింది. తాను తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటు వేయలేదని స‌జ్జ‌ల‌ స్పష్టంచేశారు. ఆయన ఓటు ఆంధ్రప్రదేశ్‌లోనే నమోదై ఉంది. తొలుత ఆయన తన ఓటును ఆంధ్రప్రదేశ్‌లోని పొన్నూరు నియోజకవర్గంలో నమోదు చేసుకున్నారు. దాన్ని మంగళగిరికి మార్చుకున్నారు.

తాను రెయిన్ ట్రీ పార్క్‌ అపార్టుమెంట్స్‌లో ఉంటున్నానని, తన నివాసం మంగళగిరి నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని, దాంతో తాను మంగళగిరిలో తన ఓటును నమోదు చేసుకున్నానని సజ్జల చెప్పారు. పొన్నూరు ఓటర్ల జాబితా నుంచి తన ఓటును, తన కుటుంబ సభ్యుల ఓట్లను తొలగించాలని జనవరి 31వ తేదీన అధికారులను ఆయన కోరారు.

నకిలీ ఓట్లను నమోదు చేసుకునే అలవాటు ఉన్నవారు అందరూ అలాగే చేస్తారని అనుకుంటారని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణలో ఓట్లు వేసిన తన మద్దతుదారులు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఓట్లను నమోదు చేసుకునే విధంగా టీడీపీ ప్రోత్సహిస్తోందని స‌జ్జ‌ల ధ్వ‌జ‌మెత్తారు. రెండు చోట్ల సజ్జలకు ఓటు ఉందనే వార్త రాయడానికి ముందు ఎల్లో మీడియా క్లారిటీ కోసం కూడా ప్రయత్నించలేదని అర్థమవుతోంది. ఎల్లో మీడియాకు ఏదో విధంగా బురద చల్లడమే కావాలి కాబట్టి క్లారిటీ తీసుకోలేదని స్పష్టంగానే తెలిసిపోతోందని స‌జ్జ‌ల అన్నారు.

Tags:    
Advertisement

Similar News