ఏపీలో మళ్లీ తెరపైకి ఫ్లెక్సీ వార్.. చంద్రబాబు టూర్‌పై ఉత్కంఠ

చంద్రబాబు పర్యటనకి కౌంటర్‌గా మంత్రి కారుమూరి వర్గం తణుకులో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని వివరిస్తూ ఆ ఫ్లెక్సీలను పెట్టారు.

Advertisement
Update: 2023-05-11 05:23 GMT

ఏపీలో మళ్లీ తెరపైకి ఫ్లెక్సీ వార్.. చంద్రబాబు టూర్‌పై ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఫ్లెక్సీ వార్ తెరపైకి వచ్చింది. ఇటీవల భారీ వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దాంతో టీడీపీ నేతలు తణుకు‌లో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇరగవరం నుంచి తణుకు మధ్య సుమారు 12 కి.మీ చంద్రబాబు పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు పర్యటనకి కౌంటర్‌గా మంత్రి కారుమూరి వర్గం తణుకులో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని వివరిస్తూ ఆ ఫ్లెక్సీలను పెట్టారు. దాంతో చంద్రబాబు పాదయాత్ర సమయంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇటీవల ప్రకాశం జిల్లాలో చంద్రబాబు రోడ్ షోని నిరసిస్తూ మంత్రి ఆదిమూలపు సురేశ్ రోడ్డుపైనే తన షర్ట్ విప్పేసి కార్యకర్తలతో కలిసి అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు‌పై రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. మరి తణుకులో మంత్రి కారుమూరి వర్గం ఏ తరహా నిరసనలు తెలియజేస్తుందో..? చూడాలి.

Tags:    
Advertisement

Similar News