షర్మిల వెనుక చంద్రబాబు - సజ్జల

బీటెక్‌ రవి, బ్రదర్ అనిల్‌కుమార్ ఎయిర్‌పోర్టులో కలిశారని, షర్మిల సీఎం రమేష్‌ ఫ్లైట్‌లోనే ప్రయాణించారని చెప్పుకొచ్చారు.

Advertisement
Update: 2024-01-06 14:59 GMT

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. YSRTP అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందన్నారు. జగన్‌కు కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యమన్నారు సజ్జల. కుటుంబం కోసం జగన్‌ పార్టీ పెట్టలేదన్నారు. ప్రజలా.. కుటుంబమా అనే ప్రశ్న వస్తే.. జగన్‌ ఫస్ట్ ఛాయిస్ ప్రజలేనని స్పష్టంచేశారు సజ్జల. తమ పార్టీకి కొన్ని విధానాలున్నాయని చెప్పారు.

వైఎస్‌ మరణంపై వైసీపీకి అనుమానాలున్నాయన్నారు సజ్జల. ఆ విషయంలో కాంగ్రెస్‌పైనా అనుమానాలున్నాయన్నారు. కాంగ్రెస్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వల్ల వైసీపీకి వచ్చే పెద్ద నష్టమేం లేదన్నారు. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి భవిష్యత్‌ లేదని.. అలాంటి పార్టీని తాము పట్టించుకోమన్నారు.

చంద్రబాబు బీజేపీని, పవన్‌కల్యాణ్‌ను మేనేజ్ చేస్తున్న తరహాలోనే.. కాంగ్రెస్‌ను సైతం మేనేజ్ చేస్తున్నాడన్నారు. కాంగ్రెస్‌తో ఎప్పుడూ చంద్రబాబు కాంటాక్ట్‌లోనే ఉన్నాడన్నారు. బీటెక్‌ రవి, బ్రదర్ అనిల్‌కుమార్ ఎయిర్‌పోర్టులో కలిశారని, షర్మిల సీఎం రమేష్‌ ఫ్లైట్‌లోనే ప్రయాణించారని చెప్పుకొచ్చారు. సంక్షేమం పేరుతో ప్రజల్లోకి వెళ్తే చంద్రబాబుకు వచ్చేవి మైనస్‌ మార్కులేనన్నారు.

Tags:    
Advertisement

Similar News