వైసీపీ మేనిఫెస్టో దెబ్బకు ప్రతిపక్షాలకు షాక్ తప్పదా..?

మేనిఫెస్టో దెబ్బకు ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అవటం ఖాయమని పార్టీవర్గాలు అంటున్నాయి. మధ్యతరగతి, పేద మహిళలకు ప్రాధాన్యత ఉండబోతోందట. బీసీలకు ఇప్పుడిస్తున్న ప్రాధాన్యతకు మించిన వరాలు ఉంటాయని తెలుస్తోంది.

Advertisement
Update: 2024-02-14 05:39 GMT

ఈనెల 18వ తేదీన అనంతపురం జిల్లాలోని రాప్తాడులో జరగబోయే ‘సిద్ధం’ బహిరంగసభలో మేనిఫెస్టో విడుదల చేయాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. గడిచిన ఆరుమాసాలుగా మేనిఫెస్టోకు రూపకల్పన చేస్తున్న కమిటీ తన బాధ్యతలను పూర్తిచేసింది. దాదాపు 15 రోజుల క్రితం మేనిఫెస్టో కమిటీ జగన్ తో భేటీ అయి వివిధ అంశాలను వివరించిందని పార్టీవర్గాల సమాచారం. జగన్ సూచనల ప్రకారం కమిటీ మేనిఫెస్టోను రెడీ చేసిందట. సిద్ధమైన మేనిఫెస్టోను జగన్ రాప్తాడు బహిరంగసభలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

మేనిఫెస్టో దెబ్బకు ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అవటం ఖాయమని పార్టీవర్గాలు అంటున్నాయి. మధ్యతరగతి, పేద మహిళలకు ప్రాధాన్యత ఉండబోతోందట. బీసీలకు ఇప్పుడిస్తున్న ప్రాధాన్యతకు మించిన వరాలు ఉంటాయని తెలుస్తోంది. అలాగే రైతు రుణమాఫీపైన కూడా హామీ ఉండొచ్చని పార్టీవర్గాలు చెప్పాయి. 2019లో ప్రకటించిన నవరత్నాల పథకాలకు మించి 2024 ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఉండబోతున్నట్లు పార్టీలో టాక్ వినబడుతోంది. జగన్ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఇంతకుముందే చంద్రబాబునాయుడు రిలీజ్ చేసిన సూపర్ సిక్స్ మినీ మేనిఫెస్టోతో పోల్చి చూడటం మొదలవుతుంది.

ఇక్కడ విషయం ఏమిటంటే.. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చేన హామీలను తర్వాత అమలుచేయలేదు. అధికారం కోసం నోటికొచ్చిన హామీలను ప్రకటించేయటం తర్వాత తుంగలో తొక్కేయటం చంద్రబాబుకు బాగా అలవాటు. పైగా తానిచ్చిన హామీలను అమలుచేయాలని ఎవరైనా గుర్తుచేసినా వారిపై ఎదురుదాడికి దిగి నోళ్ళు మూయించేయటం చంద్రబాబుకున్న అలవాటు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలేమిటి ? అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అమలు ఏమిటన్నది అందరూ చూసిందే.

ఇదే సమయంలో 2019 ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీల్లో చాలావరకు అమలుచేశారు. మద్య నిషేధం లాంటి ఆచరణ సాధ్యంకాని హామీ ఇచ్చారు. అలాగే ఎన్నికలకు ముందు ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ రద్దుచేస్తానని చెప్పి ఫెయిలయ్యారు. అయితే అంతకన్నా మెరుగైన జీపీఎస్ విధానాన్ని అమలుచేస్తున్నా ఉద్యోగులు ఒప్పుకోవటంలేదు. ఇక్కడే మేనిఫెస్టో ప్రకటన, అమలులో జనాలు జగన్, చంద్రబాబును పోల్చి చూసుకుంటున్నారు. మరి తొందరలో రిలీజవ్వబోయే మేనిఫెస్టోలో ఏయే అంశాలుంటాయో చూడాలి.

Tags:    
Advertisement

Similar News