మార్గదర్శిపై ఎందుకు నోరెత్తటంలేదు..?

కోర్టుల విచారణలోనే రామోజీ అక్రమ వ్యాపారాలు చేస్తున్నారన్న విషయం బయటపడింది. విచారణ పూర్తిచేసి రామోజీ అక్రమ వ్యాపారాలపై కోర్టు తీర్పివ్వటమే మిగిలింది.

Advertisement
Update: 2024-03-04 06:33 GMT

తెల్లారిలేచింది మొదలు వైసీపీ ప్రభుత్వం అవినీతి, అక్రమాలంటూ ఉన్నవాటిని లేనివాటిని ఎల్లోమీడియా బూతద్దంలో చూపిస్తోంది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా 24 గంటలూ, 365 రోజులు వార్తలు, కథనాలను వండివార్చటమే టార్గెట్ గా పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో చిన్న చిన్న విషయాలను కూడా చాలా పెద్దవిగా చూపించేస్తోంది. చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన విష‌యాల‌కి, జగన్ కు అసలు సంబంధమే లేనివాటిని కూడా పంచరంగుల్లో జనాలకు చూపిస్తోంది. అదే పద్దతిలో సోమవారం ‘ఈడీ.. ఇటు చూడదా’ అనే హెడ్డింగ్ తో పెద్ద స్టోరీ అచ్చేసింది.

తమిళనాడులో ఇసుకతవ్వకాలపై దృష్టిపెట్టిన ఈడీ ఏపీలో జరుగుతున్న ఇసుకతవ్వకాలపైన మాత్రం ఎందుకు దృష్టిపెట్టడంలేదని పెద్ద లాజిక్ లేవనెత్తింది. నిజమే అక్రమాలు ఎక్కడ జరిగినా దృష్టి పెట్టాల్సిందే. ఊరంతటికి నీతులు చెప్పే ఇదే యజమాని తన మార్గదర్శిలో జరుగుతున్న అవినీతి, అక్రమాల గురించి ఎందుకని నోరిప్పటంలేదు..? మార్గదర్శి చిట్ ఫండ్స్ ను అడ్డంపెట్టుకుని వేలకోట్ల రూపాయల బ్లాక్ మనీని సర్క్యులేట్ చేస్తున్నారనే ఆరోపణలపైన ఎందుకు వివరణ ఇవ్వటంలేదు..? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలకు విరుద్ధంగా దశాబ్దాలుగా మార్గదర్శి చిట్స్ ముసుగులో జనాలందరినీ పీడించి పీల్చిపిప్పి చేస్తున్నారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.

కోర్టుల విచారణలోనే రామోజీ అక్రమ వ్యాపారాలు చేస్తున్నారన్న విషయం బయటపడింది. విచారణ పూర్తిచేసి రామోజీ అక్రమ వ్యాపారాలపై కోర్టు తీర్పివ్వటమే మిగిలింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ నత్తనడక నడుస్తోందంటూ గోలపెట్టే రామోజీ తన మార్గదర్శి అక్రమాల కేసుల విషయంలో ఏమిచేస్తున్నారు. కేసు విచారణను తొందరగా జరగకుండా రామోజీ అడ్డుకుంటున్నట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎన్నోసార్లు ఆరోపణలు చేశారు. మరి ఉండవల్లి ఆరోపణలకు రామోజీ ఏరోజు ఎందుకు సమాధానం చెప్పలేదు..?

అక్కడ భూకబ్జా అని ఇక్కడ భూదందా అని బ్యానర్ హెడ్డింగులు రాస్తున్న రామోజీ తన ఫిల్మ్ సిటీ కాంపౌండ్ లో ఆక్రమణల గురించి ఎందుకు చెప్పటంలేదు..? ఆక్రమణలు లేవని కూడా చెప్పటానికి భయపడుతున్నారు కదా. తనకు గిట్టని వాళ్ళు అధికారంలో ఉంటే ఆకాశమే హద్దుగా రెచ్చిపోయే రామోజీ తన విషయంలో మాత్రం తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తుంటారనే ఆరోపణలకు కొదవేలేదు. మరి తన సొంత విషయాలపైన నోరిప్పే ధైర్యం రామోజీకుందా..?

Tags:    
Advertisement

Similar News