కూటమికి షాకింగ్ న్యూస్ చెప్పిన విజయసాయి..

ప్రశాంత్‌ కిషోర్‌ మాటల్లో విశ్వసనీయత లేదన్న విజయసాయిరెడ్డి, ఆ మాటల వెనక దురుద్దేశం ఉందన్నారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో ప్రజలకు బాగా తెలుసని చెప్పారు.

Advertisement
Update: 2024-03-06 11:15 GMT

వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉంటుంది..?

సీఎం జగన్ 2024 ఎన్నికల్లో ఏమేం హామీలివ్వబోతున్నారు..?

ప్రజలతోపాటు, వైరి వర్గం నాయకుల్లో కూడా ఈ ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వైసీపీ మేనిఫెస్టో విడుదలయ్యాక టీడీపీ దిమ్మతిరిగిపోవడం ఖాయమంటూ ఇప్పటికే కొడాలి నాని వంటి నేతలు మంచి హైప్ ఇచ్చారు. నవరత్నాలను మించి జగన్ ఎలాంటి పథకాలు తీసుకొస్తారా అనే ఆలోచన ప్రజల్లో ఉంది. కనీసం మేనిఫెస్టోపై లీకులు కూడా లేకపోవడంతో ఆ క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఈ దశలో మేనిఫెస్టో గురించి ఆసక్తికరమైన న్యూస్ చెప్పారు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈనెల 10న మేదరమెట్ల సిద్ధం సభలో మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని ఆయన ప్రకటించారు. రాప్తాడు సభలోనే మేనిఫెస్టో ప్రకటిస్తారని అనుకున్నా.. అప్పటికింకా వంటావార్పు ఓ కొలిక్కి రాలేదు. మేనిఫెస్టో కోసమే మేదరమెట్ల సిద్ధం సభను ఈనెల 3నుంచి 10కి పోస్ట్ పోన్ చేశారు. ఈనెల 10న వైరి వర్గాల దిమ్మతిరిగేలా వైసీపీ మేనిఫెస్టో విడుదలవుతుందనమాట.

విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. నెల్లూరు వైసీపీ సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ అసెంబ్లీ బరిలో ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వైసీపీ తరపున లోక్ సభ బరిలో నిలబెట్టాలని అనుకున్నా ఆయన అలిగి టీడీపీలో చేరారు. ఈ దశలో విజయసాయిరెడ్డి నెల్లూరులో ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. తాను పుట్టి పెరిగిన గడ్డపై పోటీ చేయడం సంతోషంగా ఉందని అంటున్న ఆయన, ఈరోజు నెల్లూరులో తన ఆఫీస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ మేనిఫెస్టోపై కీలక వ్యాఖ్యలు చేశారు విజయసాయి.

ప్రశాంత్‌ కిషోర్‌ మాటల్లో విశ్వసనీయత లేదన్న విజయసాయిరెడ్డి, ఆ మాటల వెనక దురుద్దేశం ఉందన్నారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో ప్రజలకు బాగా తెలుసని చెప్పారు. అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరహితమని అన్నారు. వైసీపీని మరోసారి గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పారు విజయసాయి. 

Tags:    
Advertisement

Similar News