ఇది పక్కా అవకాశవాదం కాదా.. వసంత కృష్ణప్రసాద్‌ గారూ...

జంప్‌ జిలానీలను ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతోనే వైఎస్‌ జగన్‌ ఏరివేత కార్యక్రమం చేపట్టారు. తాను నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ దాన్ని జగన్‌పైకి నెట్టే ప్రయత్నం చేశారు.

Advertisement
Update: 2024-02-05 12:52 GMT

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మూడు రాజధానుల విధానం నచ్చలేదని, ఆ విషయాన్ని తాను అప్పుడే చెప్పానని ఎమ్యెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఇప్పుడు అంటున్నారు. జగన్‌ విధానం నచ్చకపోతే అప్పుడే ఆయన వైసీపీ నుంచి ఎందుకు వైదొలగలేదనేది ప్రశ్న. జగన్‌ చేపట్టిన ఏరివేత కార్యక్రమంలో భాగంగా తనకు మళ్లీ వైసీపి టికెట్‌ రాదని తెలుసుకుని ఆయన టీడీపీలోకి జంప్‌ చేయడానికి సిద్ధ‌పడ్డారు. ఒక వైఖరికి లేదా విధానానికి కట్టుబడి ఉండేవారైతే వసంత కృష్ణప్రసాద్‌ అప్పుడే ఓ బహిరంగ ప్రకటన చేసి వైసీపీ నుంచి బయటకు వచ్చి ఉండేవారు.

కేవలం అవకాశవాదంతోనే ఆయన జగన్‌ మూడు రాజధానుల విధానాన్ని ఇప్పుడు తప్పు పడుతున్నారు. తానేదో గొప్ప ఆలోచన చేసి, జగన్‌కు చెప్పానని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఏదో విధంగా జగన్‌ను అప్రతిష్టపాలు చేయడానికి అలా మాట్లాడుతున్నారని అనుకోవాల్సి ఉంటుంది. అయినా ఆయన మాటలను విశ్వసించేదెవరు?

అటువంటి జంప్‌ జిలానీలను ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతోనే వైఎస్‌ జగన్‌ ఏరివేత కార్యక్రమం చేపట్టారు. తాను నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ దాన్ని జగన్‌పైకి నెట్టే ప్రయత్నం చేశారు. తన నియోజకవర్గ ప్రజలకు ఆయన ఏమీ చేయకపోవడం వల్లనే వసంత గ్రాఫ్‌ పడిపోయిందనేది నిజం కాదా..? అందుకే జగన్‌ ఆయనకు టికెట్‌ నిరాకరించడానికి పూనుకోవడం వాస్తవం కాదా?

కనీసం సచివాలయమైనా అమరావతి ఉంచాలని ఆయన అడిగారట. అయినా జగన్‌ అమరావతి నుంచి పూర్తిగా అన్నీ తరలించడం లేదు కదా.. లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌గా కొనసాగిస్తానని చెప్పారు కదా.. పరిపాలనా రాజధానిని విశాఖపట్నం నగరానికి, న్యాయ రాజధానిని కర్నూలుకు తరలిస్తానని చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్రల అభివృద్ధికి అది తోడ్పడుతుందని జగన్‌ భావించారు.

ఇవన్నీ ఉండగా వసంత కృష్ణప్రసాద్‌ ఆ వ్యాఖ్యలు చేశారంటే రాజకీయ అవకాశవాదం తప్ప మరోటి కాదని చెప్పక తప్పదు. ఆయన అవకాశవాదాన్ని అవగాహన చేసుకోలేని పరిస్థితిలో ప్రజలు లేరు.

Tags:    
Advertisement

Similar News