చంద్రబాబుని కలసిన నాలుగో ఎమ్మెల్యే..

తనపై పార్టీ ఆరోపణలు చేసిన తర్వాత వైసీపీ గూండాలు దాడులు చేశారన్నారు ఎమ్మెల్యే శ్రీదేవి. ఏపీలో దిశ చట్టం అసలు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తనకు ఏపీలో రక్షణ లేదని, అందుకే ప్రస్తుతం తెలంగాణలో ఉంటున్నానని చెప్పారు.

Advertisement
Update: 2023-08-10 16:28 GMT

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీకి వ్యతిరేకంగా ఓటువేశారన్న కారణంగా వైసీపీనుంచి బహిష్కరణకు గురైన నలుగురు ఎమ్మెల్యేలలో ఇప్పటికే ముగ్గురు టీడీపీ వైపు వచ్చేశారు. లోకేష్ పాదయాత్రకు మద్దతిచ్చారు, ఆ ముగ్గురిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నియోజకవర్గం కూడా ఖాయం చేశారు చంద్రబాబు. నాలుగో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తాజాగా చంద్రబాబుని కలిశారు. దీంతో వైసీపీ రెబల్స్ అందరూ టీడీపీకి దగ్గరైనట్టే చెప్పుకోవాలి.

ఉండవల్లికి ఏ నియోజకవర్గం..?

చంద్రబాబుని కలిసినా తాను పార్టీలో చేరే విషయాన్ని దాటవేశారు ఉండవల్లి శ్రీదేవి. ప్రస్తుతం ఆమె తాడికొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. అయితే అక్కడ వైసీపీ ఇన్ చార్జిని పెట్టి అన్ని కార్యక్రమాలు ఆయన ద్వారా నడిపిస్తోంది. ఎమ్మెల్యే శ్రీదేవి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. నాలుగున్నర నెలలపాటు తన భవిష్యత్ రాజకీయాల గురించి ఆలోచించానని, త్వరలో ఏ పార్టీలో చేరేది చెబుతానన్నారు ఉండవల్లి శ్రీదేవి. కష్టకాలంలో తనకు చంద్రబాబు, లోకేష్ అండగా నిలిచారని చెప్పారు.

శ్రీదేవి కీలక వ్యాఖ్యలు..

తనపై పార్టీ ఆరోపణలు చేసిన తర్వాత వైసీపీ గూండాలు దాడులు చేశారన్నారు ఎమ్మెల్యే శ్రీదేవి. ఏపీలో దిశ చట్టం అసలు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తనకు ఏపీలో రక్షణ లేదని, అందుకే ప్రస్తుతం తెలంగాణలో ఉంటున్నానని చెప్పారు. తనకు రక్షణ కల్పించాలని చంద్రబాబుని అడిగానన్నారు. తాను ఏ పార్టీలో చేరతాననే విషయం త్వరలో చెబుతానన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే శ్రీదేవి. 

Tags:    
Advertisement

Similar News