ఉదయభాను యాంకరింగ్ పై మంత్రి అంబటి సెటైర్లు

ఈ ఎపిసోడ్ లో యాంకర్ ఉదయభాను కూడా ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో ఆమె వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. మంత్రి అంబటి రాంబాబు ఉదయభాను యాంకరింగ్ పై ట్విట్టర్లో కామెంట్ చేశారు.

Advertisement
Update: 2023-07-28 05:19 GMT

నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమానికి టీవీ ఆర్టిస్ట్ ఉదయభాను యాంకరింగ్ చేశారు. పోకిరీల నుంచి అక్కని కాపాడుకునే క్రమంలో హత్యకు గురైన అమర్నాథ్ గౌడ్ అనే పిల్లవాడి సంఘటన అక్కడ చర్చకు వచ్చింది. అమర్నాథ్ గౌడ్ కుటుంబ సభ్యులతో స్టేజ్ పై మాట్లాడించారు. ఆ కుటుంబంలో బాలికను చదివించే బాధ్యత తమది అని చెప్పారు లోకేష్. ఈ ఎపిసోడ్ లో యాంకర్ ఉదయభాను కూడా ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో ఆమె వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. మంత్రి అంబటి రాంబాబు ఉదయభాను యాంకరింగ్ పై ట్విట్టర్లో కామెంట్ చేశారు.

పాపం.."యువగళం"కి

ఉదయభాను యాంకరింగ్

కావాల్సి వచ్చింది! అంటూ కౌంటర్లిచ్చారు మంత్రి అంబటి.


ఉదయభాను యాంకరింగ్ పై సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ నడిచింది. టీడీపీ వాళ్లు యాంకరింగ్ కి పిలిస్తే, ప్రోగ్రామ్ చేసి డబ్బులు తీసుకుని వెళ్లాలి కానీ, ఇలా ప్రభుత్వంపై విమర్శలు చేయడం దేనికి అంటూ కొంతమంది వైసీపీ సానుభూతిపరులు ఉదయభానుని టార్గెట్ చేశారు. దీంతో టీడీపీ నుంచి కూడా సమాధానాలు వచ్చాయి. ఉదయభాను కుమార్తెల విషయంలో బాలకృష్ణ సాయం చేశారని, ఆ కృతజ్ఞతతోనే ఆమె నారా లోకేష్ కార్యక్రమానికి వచ్చారని చెప్పారు. లోకేష్ కార్యక్రమానికి వచ్చినందుకు ఆమె రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదన్నారు.

మొత్తమ్మీద సడన్ గా ఉదయభాను తెరపైకి వచ్చి నారా లోకేష్ కార్యక్రమానికి యాంకరింగ్ చేయడం విశేషం. గతంలో నెల్లూరులో జరిగిన కార్యక్రమానికి.. పది రూపాయల డాక్టర్ గా అందరికీ పరిచయమైన డాక్టర్ నూరి పర్వీన్ సంధానకర్తగా వ్యవహరించారు. ప్రకాశం జిల్లాలో ఉదయభాను యాంకరింగ్ మాత్రం వైసీపీ వారికి నచ్చలేదు. 

Tags:    
Advertisement

Similar News