పోలీసులు వర్సెస్ లోకేష్.. యువగళంలో టెన్షన్ టెన్షన్

కుటుంబ సభ్యుడిగా అయినా తనకు అవకాశమివ్వాలన్నారు. పోలీసులు కుదరదని చెప్పడంతో క్యాంప్ సైట్ వద్ద నేలపై కూర్చుని నిరసనకు దిగారు లోకేష్.

Advertisement
Update: 2023-09-09 02:21 GMT

చంద్రబాబుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అటు నారా లోకేష్ యువగళం క్యాంప్ సైట్ వద్ద కూడా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. తండ్రిని చూసేందుకు లోకేష్ విజయవాడ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ఈలోగా పోలీసులు అక్కడికి వచ్చారు. లోకేష్ ని కదలనీయకుండా చేశారు. శాంతిభద్రతల సమస్య వస్తుందని, ఆయన విజయవాడకు వెళ్లడానికి వీలు లేదని చెప్పారు.


పోలీసులతో వాగ్వాదం..

తన తండ్రిని చూసేందుకు వెళ్లనీయకపోవడం దారుణం అంటూ పోలీసులపై లోకేష్ ఫైర్ అయ్యారు. తన వెంట నాయకులెవరూ రారని పోలీసులకు హామీ ఇచ్చారు. అయినా వాళ్లు కుదరదని చెప్పడంతో, జగన్ మీకు అలాంటి ఆర్డర్లు ఇచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుడిగా అయినా తనకు అవకాశమివ్వాలన్నారు. పోలీసులు కుదరదని చెప్పడంతో క్యాంప్ సైట్ వద్ద నేలపై కూర్చుని నిరసనకు దిగారు లోకేష్. దీంతో కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడలో యువగళం క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


జగన్ పై ఘాటు ట్వీట్..

చంద్రబాబు అరెస్ట్ తర్వాత నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. "పిచ్చోడు లండన్ కి, మంచోడు జైలుకి. ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం. FIR లో పేరు లేదు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు. మిగిలేది కేవలం లండన్ పిచ్చోడి కళ్లలో ఆనందం. నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సాధ్యం కాదు సైకో జగన్." అంటూ ఘాటు ట్వీట్ పెట్టారు. 



Tags:    
Advertisement

Similar News