పిన్నెల్లి హత్యకు టీడీపీ ప్లాన్.. పేర్ని నాని సంచలనం

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి.. ఈ కుట్రలపై గవర్నర్, రాష్ట్రపతి, ప్రధానికి మొర పెట్టుకుంటే గానీ పారామిలిటరీ బలగాలను పంపలేదన్నారు నాని.

Advertisement
Update: 2024-05-27 03:33 GMT

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కొద్దిరోజులుగా టీడీపీ గ్యాంగ్ టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి పేర్నినాని సంచలన ఆరోపణలు చేశారు. పిన్నెల్లి హత్యకు తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు నాని. పిన్నెల్లికి ఎలాంటి హాని జరిగినా ఆ బాధ్యత సీఐ నారాయణ స్వామి, గుంటూరు రేంజ్ ఐజీ, డీజీపీలదే బాధ్యత అన్నారు. కూటమి నేతలు ఎవరిని నియమించాలని కోరితే అధికారులు వారినే నియమించారని చెప్పుకొచ్చారు.

సీఐ నారాయణస్వామిని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని పిన్నెల్లి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఆయన ఇంటి దగ్గర బందోబస్తు నిర్వహిస్తున్న పారామిలిటరీ బలగాలను ఎందుకు వెన‌క్కు పిలిపించారో చెప్పాలన్నారు నాని. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి.. ఈ కుట్రలపై గవర్నర్, రాష్ట్రపతి, ప్రధానికి మొర పెట్టుకుంటే గానీ పారామిలిటరీ బలగాలను పంపలేదన్నారు నాని.

పోలీసు వ్యవస్థకు మాయని మచ్చలా తయారైన అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జూన్ 4 తర్వాత తాడిపత్రి, పల్నాడు, తిరుపతిలో టీడీపీ గూండాలకు సపోర్ట్ చేసిన వారు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

Tags:    
Advertisement

Similar News