Taraka Ratna: హైదరాబాద్ కు తారకరత్న మృతదేహం.. సోమవారం అంత్యక్రియలు

Taraka Ratna: తారకరత్న మృతదేహాన్ని ఆదివారం ఉదయానికి హైదరాబాద్ లోని ఆయన నివాసానికి తరలిస్తారు.. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు.

Advertisement
Update: 2023-02-18 17:36 GMT

తారకరత్న మృతదేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ కి తరలిస్తున్నారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో ఆయన కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. తారకరత్న మరణాన్ని ధృవీకరించే విషయంలో ఆస్పత్రి వర్గాలు ముందుగానే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.


శివరాత్రి పండగ అయినా కూడా బాలకృష్ణ సహా కుటుంబ సభ్యులు బెంగళూరు ఆస్పత్రికి వెళ్లారు. యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. టీడీపీ నాయకులు కూడా ఆస్పత్రికి వెళ్లడంతో కీలక ప్రకటన వెలువడుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అనుకున్నట్టుగానే తారకరత్న మరణంపై ఆస్పత్రి వర్గాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి.




తారకరత్న మృతదేహాన్ని ఆదివారం ఉదయానికి హైదరాబాద్ లోని ఆయన నివాసానికి తరలిస్తారు.. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. సోమవారం సాయంత్రం 5 గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలియజేశారు.

నారాయణ హృదయాలయకు చేరుకున్న నారా లోకేష్, బాలకృష్ణ.. తారకరత్న మృతదేహాన్ని హైదరాబాద్ కి తరలించే ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. బావా అంటూ ఆప్యాయంగా పిలిచే వ్యక్తి ఇక లేరని ఆస్పత్రి వద్ద కంటతడి పెట్టారు లోకేష్. చంద్రబాబు ట్విట్టర్లో సంతాప సందేశం పోస్ట్ చేశారు.

యువగళం పాదయాత్ర తొలిరోజే తారకరత్న అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అప్పటినుంచి డాక్టర్లు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. 23రోజులపాటు కోమాలో ఉన్న ఆయన బెంగళూరులోనే తుదిశ్వాస విడిచారు.

Tags:    
Advertisement

Similar News