చంద్రబాబుతో పీకే భేటీ.. I-PAC సంచలన ప్రకటన

తెలుగుదేశం సోషల్‌ మీడియా ప్రచార బాధ్యతలు ఇకపై ప్రశాంత్ కిషోర్‌కు అప్పగిస్తారని తెలుస్తోంది. ఏపీలో రీజియన్ల వారీగా ప్రత్యేక వ్యూహాలు రూపకల్పనకు పీకే ప్లాన్ చేసినట్లు సమాచారం.

Advertisement
Update: 2023-12-23 16:00 GMT

పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌ ప్రశాంత్‌ కిషోర్‌ టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. విజయవాడలోని చంద్రబాబు నివాసంలో దాదాపు మూడు గంటల పాటు ఇరువురి మ‌ధ్య‌ చర్చలు జరిగాయి. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రశాంత్‌ కిషోర్‌.. చంద్రబాబు పిలిస్తేనే తాను వచ్చానని, త్వరలోనే మళ్లీ వస్తానంటూ కామెంట్స్ చేశారు. దాదాపు మూడు నెలల నుంచి పీకేతో నారా లోకేశ్‌ చర్చలు జరుపుతున్నారని సమాచారం. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబుతో పీకే చర్చించారని తెలుస్తోంది. తాను తెచ్చిన సర్వే వివరాలను చంద్రబాబుకు పీకే వివరించారని సమాచారం.

తెలుగుదేశం సోషల్‌ మీడియా ప్రచార బాధ్యతలు ఇకపై ప్రశాంత్ కిషోర్‌కు అప్పగిస్తారని తెలుస్తోంది. ఏపీలో రీజియన్ల వారీగా ప్రత్యేక వ్యూహాలు రూపకల్పనకు పీకే ప్లాన్ చేసినట్లు సమాచారం. చంద్రబాబు - పవన్‌కల్యాణ్ కాంబినేషన్‌ను జనంలోకి తీసుకెళ్లే అంశంపై ప్రణాళికలు రెడీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇకపై పీకే గైడెన్స్‌లోనే రాబిన్‌ శర్మ టీమ్‌ పని చేయబోతుందని సమాచారం.




ఇక చంద్రబాబు- ప్రశాంత్ కిషోర్‌ సమావేశం ఓ వైపు జరుగుతుండగానే.. ప్రముఖ పొలిటికల్ సర్వే సంస్థ ఐ-ప్యాక్‌ సంచలన ప్రకటన చేసింది. గతేడాది కాలంగా తాము వైసీపీ కోసమే పని చేస్తున్నామని స్పష్టంచేసింది. 2024లో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని బంపర్‌ మెజారిటీతో తిరిగి గెలిపించడమే తమ లక్ష్యమని ప్రకటించింది. అందుకోసం అవిశ్రాంతంగా పని చేస్తామని వివ‌రించింది. 

Tags:    
Advertisement

Similar News