తెనాలిలో పవన్ పై రాళ్లదాడి..! ఆయనకు ఏమైందంటే..?

తెనాలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పవన్ పై ఓ వ్యక్తి రాయి విసిరాడు. వెంటనే అప్రమత్తమైన జనసైనికులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు, పోలీసులకు అప్పగించారు.

Advertisement
Update: 2024-04-14 13:37 GMT

సీఎం జగన్ పై రాళ్లదాడి జరిగి 24 గంటలు గడవకముందే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా సరిగ్గా అలాంటి దాడికి ప్రయత్నం జరిగినట్టు తెలుస్తోంది. తెనాలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పవన్ పై ఓ వ్యక్తి రాయి విసిరాడు. వెంటనే అప్రమత్తమైన జనసైనికులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు, పోలీసులకు అప్పగించారు. జగన్ పై జరిగిన దాడిలో నిందితుడి ఆచూకీ ఇంతవరకు దొరకలేదు, ఇటు పవన్ పై జరిగిన దాడిలో మాత్రం నిందితుడిని స్పాట్ లోనే పట్టుకున్నారు పోలీసులు.

పవన్ కి ఏమైంది..?

విజయవాడ ఘటనలో సీఎం జగన్ కి ఎడమకంటి పై భాగంలో దెబ్బతగలడం, వైద్యులు కుట్లు వేయడం తెలిసిందే. అయితే తెనాలి ఘటనలో మాత్రం ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. పవన్ పైకి రాయి విసరడం స్పష్టంగా తెలుస్తున్నా.. ఆ రాయి ఆయనకు తగలలేదు, పక్కనపడిందని అంటున్నారు. పవన్ కి రాయి తగిలి ఉంటే ప్రమాదం జరిగి ఉండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనసైనికులు. అయితే ఇది జనసేన హడావిడేనా.. నిజంగానే పవన్ పై రాళ్లదాడికి ప్రయత్నించారా అనేది తేలాల్సి ఉంది.

ఎల్లో మీడియా హడావిడి..

నిన్నటి నుంచి సీఎం జగన్ పై జరిగిన దాడిని వీలైనంత తక్కువ చేసి చూపించాలని ఎల్లో మీడియా తెగ కష్టపడిపోతోంది. అది చిన్న దెబ్బేనని, జగన్ కి ఏమీ కాలేదని కథనాలిచ్చింది. ఓ దశలో అదో పెద్ద డ్రామా అంటూ సీన్ క్రియేట్ చేసింది, కొంతమంది టీడీపీ, జనసేన నేతలు కూడా ఇలాంటి కామెంట్లే పెట్టి సోషల్ మీడియాలో చీవాట్లు తిన్నారు. ఇప్పుడు పవన్ కి కూడా అలాంటి ఘటనే ఎదురైందనే వార్తలతో ఎల్లో మీడియా మరింత హడావిడి చేస్తోంది. 'వారాహి యాత్రలో ఉద్రిక్తత', 'పవన్ పై రాళ్లదాడి', 'పవన్ టార్గెట్ గా కుట్రలు' అంటూ కథనాలిస్తోంది. గతంలో బ్లేడ్ బ్యాచ్ తనపై దాడికి ప్రయత్నించిందంటూ పవన్ చెప్పిన మాటల్ని పదే పదే ప్రచారం చేస్తూ పవన్ కి ముప్పు పొంచి ఉందని అంటోంది ఎల్లో మీడియా. ఇప్పుడిప్పుడే పవన్ కి సోషల్ మీడియాలో పరామర్శలు జోరందుకుంటున్నాయి. 

Tags:    
Advertisement

Similar News