జగన్‌ సాధించే స్థానాల లెక్క తేల్చిన ‘నిఘా’

కొద్ది నెలల నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ‘వైనాట్‌ 175’ అనే ప్రచారాన్ని సాగిస్తోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు.

Advertisement
Update: 2024-03-25 08:36 GMT

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాలు సాధిస్తుందని మెజారిటీ సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని ఒకటి, రెండు సర్వేలు మాత్రమే చెప్పాయి. ఈ స్థితిలో రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఓ నివేదిక సమర్పించింది.

రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 110 నుంచి 115 స్థానాల్లో విజయం సాధిస్తుందని రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఆ నివేదికలో చెప్పినట్లు సమాచారం. అయితే, వైఎస్‌ జగన్‌ తమ పార్టీ గెలిచే స్థానాలపై ఇంటెలిజెన్స్‌ వేసిన లెక్కలను అంగీకరించలేదని తెలుస్తోంది. తమ పార్టీ 130 స్థానాల వరకు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం.

కొద్ది నెలల నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ‘వైనాట్‌ 175’ అనే ప్రచారాన్ని సాగిస్తోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉందని, జగన్‌ తిరిగి అధికారంలోకి వస్తారని భావిస్తున్నారు.

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కింది స్థాయిలో తీవ్రమైన విభేదాలు చోటు చేసుకున్నాయి. పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమిలోని పార్టీల నాయకుల మధ్య, ఆయా పార్టీలకు చెందిన స్థానిక నాయకుల మధ్య తగాదాలు చోటు చేసుకున్నాయి. అసమ్మతి జ్వాలలను చల్చార్చడం పార్టీల నేతలకు తలకు మించిన భారంగా మారింది. దీన్ని వైఎస్సార్‌సీపీ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది.

Tags:    
Advertisement

Similar News