వీళ్ళకి హామీలు మాత్రమే.. నో టికెట్స్

తెనాలిలో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా షాక్ తప్పదు. కారణం ఇక్కడి నుండి జనసేన సెకండ్ లెఫ్ట్ నెంట్ నాదెండ్ల మనోహర్ పోటీకి రెడీ అవుతున్నారు.

Advertisement
Update: 2024-01-13 05:12 GMT

పొత్తులు పెట్టుకున్న పార్టీల మధ్య సీట్ల సమస్య చాలా సహజం. పొత్తు పార్టీల్లోని కొందరు నేతలు తమ సీట్లను ఎదుటి పార్టీకి త్యాగాలు చేయకతప్పదు. అయితే టీడీపీ-జనసేన మధ్య పొత్తుల వ్యవహారం మాత్రం టీడీపీలో మంటలు పుట్టిస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరితో పాటు తమ అధినేత చంద్రబాబు విషయమై చాలామంది సీనియర్లు మండిపోతున్నారు. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో సీనియర్ల టికెట్లకే జనసేన ఎసరుపెడుతోంది కాబట్టి.

ఇప్పటికి బయటపడింది కొన్ని నియోజకవర్గాలు మాత్రమే. విషయం ఏమిటంటే.. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి టికెట్ దక్కేది దాదాపు అనుమానమే. ఈ టికెట్ ను తన మద్దతుదారుడు కందుల దుర్గేష్ కు పవన్ హామీ ఇచ్చారు. కాబట్టి కందుల నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. పెందుర్తి నియోజకవర్గంలో బండారు సత్యానారాయణమూర్తికి కూడా టికెట్ లేనట్లే. ఎందుకంటే ఇక్కడి నుండి జనసేన నేత పంచకర్ల రమేష్ పోటీచేయబోతున్నారట.

తెనాలిలో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా షాక్ తప్పదు. కారణం ఇక్కడి నుండి జనసేన సెకండ్ లెఫ్ట్ నెంట్ నాదెండ్ల మనోహర్ పోటీకి రెడీ అవుతున్నారు. నాదెండ్లకు టికెట్ ఇప్పించుకోలేకపోతే పవన్ కే అవమానం. నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్నపాత్రుడికి కూడా టికెట్ దాదాపు లేనట్లే. ఇక్కడ పొత్తు ప్రభావం కొంత కొడుకు విజయ్ ఎఫెక్టు కొంత కలిసి అయ్యన్నకు సీటు లేకుండా చేస్తోందట. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు కూడా టికెట్ డౌటే అంటున్నారు. ఎందుకంటే విశాఖ తూర్పులో టికెట్ ఇప్పించే హామీ మీదే వైసీపీ ఎమ్మెల్సీ వంశీని పవన్ జనసేనలోకి తీసుకున్నారట.

ఇవికాకుండా తిరుపతి, పిఠాపురం, కాకినాడ రూరల్, భీమిలి, విజయవాడ సెంట్రల్, పాయకరావుపేట లాంటి మరికొన్ని నియోజకవర్గాలపైన జనసేన కర్చీఫ్ వేసింది. విషయం ఏమిటంటే.. ఈ నియోజకవర్గాల్లో సీనియర్ తమ్ముళ్ళు దశాబ్దాలుగా పోటీచేస్తున్నారు. జనసేనతో పొత్తు కారణంగా బలమైన తమ్ముళ్ళకి టికెట్లు లేకుండా పోతోందని టాక్ వినబడుతోంది. అందుకనే అధికారంలోకి రాగానే రాజ్యసభ ఇస్తానని, ఎమ్మెల్సీని చేస్తానని తమ్ముళ్ళకి చంద్రబాబు హామీలిస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఇంకెంతమంది సీనియర్లకు జనసేన వల్ల షాక్ కొడుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News