కొడాలి నాని హెల్త్‌పై రూమర్లు.. ఇదిగో క్లారిటీ

కొడాలి నాని అస్వస్థకు గురయ్యారంటూ కొందరు వ్యక్తులు సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ వార్తను ఎల్లో మీడియా ఛానళ్లు, వెబ్‌సైట్లు ప్రచారం చేశాయి.

Advertisement
Update: 2024-05-23 12:29 GMT

గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు ఆయన అనుచరులు. నాని ఎప్పటిలాగానే పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని సూచించారు. నాని ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..!

కొడాలి నాని అస్వస్థకు గురయ్యారంటూ కొందరు వ్యక్తులు సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ వార్తను ఎల్లో మీడియా ఛానళ్లు, వెబ్‌సైట్లు ప్రచారం చేశాయి. కొడాలి నాని తన స్వగృహంలో సోఫాలో ఒక్కసారిగా కుప్ప కూలిపోయారని, వెంటనే గన్‌మెన్లు అక్కడున్న నేతలను బయటకు పంపించి వైద్యులకు సమాచారం ఇచ్చారని, ప్రథమ చికిత్స చేసిన డాక్టర్లు, నానికి సెలైన్ ఎక్కిస్తున్నారంటూ ప్రచారం చేశారు.

అతిగా ఆలోచించడం వల్లే నాని అస్వస్థకు గురయ్యారని డాక్టర్లు చెప్పారని ఓ తప్పుడు కథనాన్ని వండి వార్చారు. అక్కడితో ఆగకుండా కొడాలి నాని కుటుంబ సభ్యులు సైతం హుటాహుటిన హైదరాబాద్ నుంచి గుడివాడకు బయల్దేరారని దుష్ప్ర‌చారానికి తెర‌లేపారు. ఈ రూమర్లు కొడాలి నాని అనుచురుల దృష్టికి రావడంతో క్లారిటీ ఇచ్చారు. స్వయంగా నాని సైతం సోఫాలో ప్రశాంతంగా కూర్చున్న ఓ వీడియోను ట్విట్టర్‌లో కాసేపటి క్రితమే పోస్ట్ చేశారు.

Tags:    
Advertisement

Similar News