పవన్ ఫెయిల్యూర్ కి కారణాలివేనా..?

ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన అనుభవం ఉండి, ఎవరికీ లేనంతగా అభిమానుల మద్దతుండి కూడా రాజకీయాల్లో ఫెయిలయ్యారంటే అది పవన్ స్వయంకృతమనే అనుకోవాలి.

Advertisement
Update: 2022-12-04 04:42 GMT

రాజకీయాల్లో తాను ఫెయిలయ్యానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓపెన్‌గానే అంగీకరించారు. తానొక ఫెయిల్డ్ పొలిటీషియన్ అని తనంతట తానే ప్రకటించారు కాబట్టి ఈ విషయంపై చర్చ అవసరంలేదు. అయితే రాజకీయాల్లో ఎందుకు ఫెయిలయ్యారు..? అపారమైన అభిమానుల మద్దతుండి కూడా పవన్ ఫెయిలవ్వటం ఆశ్చర్యమే. సినిమా హీరోల్లో పవన్ కల్యాణ్‌కు ఉన్నంత ఫ్యాన్ బేస్ మరే హీరోకి లేదంటే అతిశయోక్తికాదు.

ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన అనుభవం ఉండి, ఎవరికీ లేనంతగా అభిమానుల మద్దతుండి కూడా రాజకీయాల్లో ఫెయిలయ్యారంటే అది పవన్ స్వయంకృతమనే అనుకోవాలి. ఇంతకీ పవన్ ఫెయిల్యూర్లకు కారణాలు ఏమిటి..? ఒకటి కాదు చాలానే ఉన్నాయి. మొదటిదేమో ప్రత్యర్ధుల బలాన్ని సరిగా అంచనా వేయలేకపోవటం. రెండోది అంచనా వేసినా అంగీకరించలేని ఇగో ప్రాబ్లమ్. మూడోది తనను తాను వాస్తవానికి మించి చాలా ఎక్కువగా ఊహించుకోవటం.

క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసుకోకుండా గుడ్డిగా వ్యవహరించటం. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి పోటీచేయకుండా కేవలం మద్దతు మాత్రమే ఇవ్వటం. అప్పుడే పోటీచేసుంటే ఆ ఊపులో జనసేన తరపున కనీసం ఓ ఐదుమందో పదిమందో ఎమ్మెల్యేలు గెలిచేవారేమో. ఇక 2019లో ఓడిపోయిన తర్వాత తటస్తంగా ఉండకుండా చంద్రబాబునాయుడు ప్రయోజనాల కోసమే పనిచేయటం. ప్రశ్నించటానికే పార్టీ పెట్టానని చెప్పుకునే పెద్దమనిషి అధికారంలో ఉన్నపుడు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు..?

మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరికీ సమదూరం పాటించుంటే ఈపాటికి జగన్ కు సరైన ప్రత్యామ్నాయమయ్యేవారేమో. మాటస్థిరత్వం లేకపోవటం పెద్ద సమస్య. ఈరోజు చెప్పిన మాటకు రేపు పూర్తి విరుద్ధంగా మాట్లాడటమే మైనస్. ఏ విషయంలో కూడా పూర్తి పరిజ్ఞానం లేకపోవటం మరో మైనస్. పార్టీ పెట్టి తొమ్మిదేళ్ళయినా ఇంకా పార్టీ నిర్మాణం జరపకపోవటం కూడా ఫెయిల్యూరే. విశేషమైన అభిమానుల మద్దతును ఓట్లరూపంలో మలచుకోలేకపోవటం అతిపెద్ద ఫెయిల్యూర్. ఫెయిలైనట్లు అంగీకరించటం కాదు అందుకు కారణాలను నిజాయితీగా విశ్లేషించుకున్నప్పుడే తప్పులను పునరావృతం చేయకుండా విజేతలయ్యే అవకాశముంది.

Tags:    
Advertisement

Similar News