పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా.. మేం డిప్యూటీ సీఎం తాలూకా

వారం రోజుల్లో రిజల్ట్ రాబోతున్న దశలో అటు జనసేన, ఇటు వైసీపీ అభిమానులు మాత్రం ఓ రేంజ్ లో హడావిడి చేస్తున్నారు. తమ నాయకులే గెలిచేశారని తేల్చేస్తున్నారు.

Advertisement
Update: 2024-05-27 07:40 GMT

ఎన్నికల ఫలితాలకోసం ఏపీ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పిఠాపురంలో ఈ ఆసక్తి మరింత ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ పిఠాపురంలో బోణీ కొడతారో లేదోనని జనసైనికులు టెన్షన్ పడుతున్నారు. మరోవైపు పవన్ ని ఓడించి వంగా గీత డిప్యూటీ సీఎంగా పదవి అందుకుంటారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఈలోగా కొంతమంది అత్యుత్సాహవంతులు మాత్రం పిఠాపురంలో నేమ్ ప్లేట్లు, స్టిక్కర్లతో గోల గోల చేస్తున్నారు.


పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా.. అంటూ జనసైనికులు కొందరు బండి వెనక నెంబర్ ప్లేట్ వద్ద రాయించుకున్నారు. ఇలాంటి బైక్ లు పిఠాపురంలో చాలానే కనపడుతున్నాయి. ఒకరిని చూసి మరొకరు ఈ ట్రెండ్ కొనసాగిస్తున్నారు. కూటమి అభ్యర్థిగా పవన్ ఇక్కడ విజయం సాధించేశారని వారు డిసైడ్ అయ్యారు. అందుకే మా ఎమ్మెల్యేగారు అంటూ హడావిడి చేస్తున్నారు.

గీత అభిమానులు ఇలా..

ఇక వంగా గీత అభిమానులు డిప్యూటీ సీఎం అంటూ స్టిక్కర్లు వేయించుకుంటున్నారని తెలుస్తోంది. జనసైనికులకు పోటీగా వీరు కూడా హడావిడి మొదలు పెట్టారు. మా ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అంటున్నారు. జగన్ సీఎం, వంగా గీత డిప్యూటీ సీఎం అంటూ సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు.

పిఠాపురంలో ఎవరు గెలిచినా మెజార్టీ అతి స్వల్పంగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. వారం రోజుల్లో రిజల్ట్ రాబోతున్న దశలో అటు జనసేన, ఇటు వైసీపీ అభిమానులు మాత్రం ఓ రేంజ్ లో హడావిడి చేస్తున్నారు. తమ నాయకులే గెలిచేశారని తేల్చేస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News