హాట్ సీట్లలో ఇది కూడా ఒకటా..?

నరసాపురంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ తాను పోటీచేయబోతున్నట్లు చెబుతున్నారు. అయితే ఏ పార్టీ తరపున పోటీచేస్తాననే విషయాన్ని మాత్రం ప్రకటించలేకపోతున్నారు.

Advertisement
Update: 2024-01-18 04:44 GMT

రాబోయే ఎన్నికల్లో కొన్ని హాట్ సీట్లున్నాయి. ఈ హాట్ సీట్లలో అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంటు సీట్లు కూడా ఉన్నాయి. మామూలుగా అయితే పార్లమెంటు సీట్లను పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఒక పార్లమెంటు సీటుగురించి రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోని జనాలు ఏమాత్రం పట్టించుకోరు. కానీ, రాబోయే ఎన్నికలకు సంబంధించి మాత్రం నాలుగైదు పార్లమెంటు సీట్లపై జనాల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. అలాంటి సీట్లలో మొదటిది నరసాపురం సీటు.

నరసాపురంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ తాను పోటీచేయబోతున్నట్లు చెబుతున్నారు. అయితే ఏ పార్టీ తరపున పోటీచేస్తాననే విషయాన్ని మాత్రం ప్రకటించలేకపోతున్నారు. వైసీపీ నుండి బయటకు వచ్చేసిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా కోర్టుల్లో ఎంపీ కేసులు వేస్తున్నారు. ఏదో కేసులో ఎంపీని అరెస్టు చేసిన సీఐడీ బాగా సత్కరించిందంట. అందుకనే జగన్ అంటే రాజు మండిపోతున్నారు. ఆ కసితోనే జగన్ వ్యతిరేకులతో చేతులు కలిపి ప్రతిరోజు బురదచల్లేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో నరసాపురంలో మళ్ళీ గెలవాలని రాజు, రాజును ఎలాగైనా ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకున్నది. రాజు ఎన్నికల్లో దిగితే ఉంటుంది అసలు సినిమా.

రాష్ట్రంలో అడుగుపెడితే ఏమవుతుందో అనే భయం ఎంపీలో పెరిగిపోతోంది. అందుకనే ఏపీలోకి ఎప్పుడు రావాలన్నా కోర్టులో పిటీషన్ వేసి అదనపు భద్రత ఏర్పాటు చేసుకుంటున్నారు. జగన్ దెబ్బకు భయపడిపోయిన రాజు రాబోయే ఎన్నికల్లో స్వేచ్ఛ‌గా ఎలాగ ప్రచారం చేసుకుంటారో అనే ఆసక్తి పెరిగిపోతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెంలో టీడీపీ+జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.

పై రెండుపార్టీల్లో ఏదో ఒకదాని నుండి పోటీచేస్తానని అంటున్నారే కానీ, ఏ పార్టీ అని చెప్పటానికే భయపడిపోతున్నారు. ఏ పార్టీ తరపున పోటీ పోటీచేస్తాననే విషయాన్ని చెప్పటానికి కూడా రాజు ఎందుకు భయపడుతున్నారో అర్థంకావటంలేదు. ఇంతకీ రెండుపార్టీల్లో ఏదైనా రాజుకు టికెట్ ఇవ్వటానికి సుముఖంగా ఉందా అన్న డౌటు కూడా జనాల్లో పెరిగిపోతోంది. మరి చివరకు రెండుపార్టీలు ఏమంటాయో, రాజు ఏమి చేస్తారో చూడాలి.

Tags:    
Advertisement

Similar News