విడాకుల పుకార్లపై పవన్ రియాక్షన్..

Pawan Kalyan - Anna Lezhneva | ఇటీవల మెగా కుటుంబంలో జరిగిన ఫంక్షన్లకు పవన్ ఒంటరిగానే హాజరయ్యారు. వరుణ్ తేజ్ నిశ్చితార్థానికి కూడా ఆయన ఒక్కడే వచ్చారు, రామ్ చరణ్ కుమార్తె బారసాలకు అన్నా లెజ్నోవా హాజరు కాలేదు.

Advertisement
Update: 2023-07-05 14:08 GMT

విడాకుల పుకార్లపై పవన్ రియాక్షన్..

వారాహి యాత్ర తర్వాత పవన్ కల్యాణ్ ని మరోసారి వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో వైసీపీ అనుకూల అకౌంట్లు టార్గెట్ చేశాయి. భార్య అన్నా లెజ్నోవాకు పవన్ దూరంగా ఉన్నారని, లీగల్ గా సెపరేట్ అయ్యారని, విడాకులు తీసుకోబోతున్నారని కథనాలిచ్చాయి. వెబ్ సైట్స్ లో పుకార్లకు కొదవే లేదు కానీ, సాక్షి నేరుగా పవన్ ని టార్గెట్ చేయడం విశేషం. విడాకుల వార్తలు సాక్షి మీడియాలో హైలెట్ అయ్యాయి. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టారు పవన్ కల్యాణ్. జనసేన లేటెస్ట్ ట్వీట్ లో పవన్, అన్నా లెజ్నోవా కలసి కనిపించారు.


వారాహి విజయంపై పూజలు..

ఇటీవల తొలిదశ వారాహి యాత్ర విజయవంతమైన సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో పవన్, అన్నా లెజ్నోవా పూజలు నిర్వహించారని జనసేన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ఫొటో విడుదల చేశారు. ఇందులో పవన్ దంపతులిద్దరూ కలసి కనిపించారు. కొద్దిరోజుల్లో వారాహి రెండో దశ యాత్ర మొదలవుతుందని, దానికి సంబంధించిన సన్నాహక సమావేశాలకోసం పవన్ మంగళగిరి వస్తారని కూడా ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

సహజంగా పవన్ కల్యాణ్ ఇంట్లో పూజలు జరిగితే ప్రెస్ నోట్ విడుదల చేసేవారు, కానీ ఈసారి పవన్, అన్నా లెజ్నోవా ఫొటోని బయటకు విడుదల చేశారు. పుకార్లకు చెక్ పెట్టేందుకే ఈ పని చేశారని తెలుస్తోంది. ఇటీవల మెగా కుటుంబంలో జరిగిన ఫంక్షన్లకు పవన్ ఒంటరిగానే హాజరయ్యారు. వరుణ్ తేజ్ నిశ్చితార్థానికి కూడా ఆయన ఒక్కడే వచ్చారు, రామ్ చరణ్ కుమార్తె బారసాలకు అన్నా లెజ్నోవా హాజరు కాలేదు. దీంతో పవన్ వైవాహిక జీవితంపై పుకార్లు మొదలయ్యాయి. రాజకీయ యాత్రలకు వెళ్లేటప్పుడు పవన్ కి వీర తిలకం దిద్ది పంపించే భార్య, వారాహి యాత్ర సందర్భంగా అసలు బయటకు రాకపోవడంతో ఈ పుకార్లకు బలం చేకూరింది. ఆమె స్విట్జర్లాండ్ లో ఉంటున్నారని, పవన్ కి దూరమయ్యారని కూడా కథనాలు వచ్చాయి. అయితే వీటన్నిటికీ ఒక్క ట్వీట్ ద్వారా పవన్ సమాధానమిచ్చారు. అన్నా కొణిదెల అంటూ ఆ ట్వీట్ లో ప్రత్యేకంగా పేర్కొనడం విశేషం. 

Tags:    
Advertisement

Similar News